
ఘట్కేసర్, వెలుగు: చెల్లెలు ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో ఓ యువకుడు ఆమె భర్తపై కత్తితో దాడి చేశాడు. ఘట్కేసర్ కు చెందిన సాయి అలియాస్ మోక్షయాదవ్ డీజే ఆపరేటర్. ఇతను స్థానికంగా ఉండే మహేశ్చెల్లెలు మానసను ప్రేమించాడు. కొంత కాలం కింద పెద్దలకు ఇష్టం లేకున్నా మానసను పెండ్లి చేసుకున్నాడు. దీంతో సాయిపై కోపం పెంచుకున్న మహేశ్గురువారం జరిగిన వినాయక శోభయాత్రలో డీజే అపరేట్ చేస్తున్న సాయిపై కత్తితో దాడి చేశాడు. వెనుక నుంచి బలంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడ్డ సాయిని స్థానికులు కీసరలోని ప్రైవేట్ దవాఖానకు తరలించారు. మానస ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్టు ఘట్కేసర్సీఐ సైదులు తెలిపారు.