శ్రావణ పౌర్ణమి 2024 ఆగస్టు 19న సోమవారం వస్తుంది. అందుకే ఈసారి రాఖీ పండుగను ఆగస్టు 19న జరుపుకుంటారు. ఈ రాఖీ పర్వదినం రోజున అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. అందుకే ఈ సంవత్సరం రక్షా బంధన్ పండుగ చాలా పవిత్రమైనది. ఫలవంతమైనది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాఖీ పండగ రోజున సోదరీమణులు తమ సోదరుడి సంతోషకరమైన జీవితం, పురోగతి కోసం సోదరుడి రాశిని బట్టి రాఖీని కట్టాలి. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ఏ రాశి వారికి ఎలాంటి రంగు రాఖీ కట్టాలో తెలుసుకుందాం. . .
ప్రతి సంవత్సరం శ్రవణ మాసం పౌర్ణమి రోజున రాఖీ పండుగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. రాఖీ పండుగ అన్నా చెల్లెళ్ళ ప్రేమకు అమూల్యమైన వేడుక. ఈ పండుగ సోదరసోదరీమణులు మధ్య అందమైన అనుబంధానికి అంకితం చేయబడింది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీ కట్టి వారికి శుభాకాంక్షలు చెబుతారు. సోదరులు కూడా ఈ రోజున వారి సోదరీమణులకు బహుమతి ఇచ్చి జీవితాంతం రక్షిస్తానని వాగ్దానం చేస్తాడు. సోదరులు సోదరీమణులను రక్షించడానికి, శ్రద్ధ వహించడానికి.. రాఖీ పండుగ ఆప్యాయత, విశ్వాసం, నిస్వార్థ ప్రేమ భావాన్ని వ్యక్తపరుస్తుంది. అయితే ఒక్కో రంగు రాఖీ ఒక్కో రాశి వారి వారిపై ప్రభావంచూపుతుంది. ఇప్పుడు ఆ వివరాలు మీకోసం....
- మేష రాశి: ఈ రాశికి చెందిన వారికి రక్షాబంధన్ రోజున సోదరీమణులు ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు.
- వృషభ రాశి: ఈ రాశికి చెందిన వ్యక్తులకు రక్షాబంధన్ రోజున తెల్లటి రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడు బలపడతాడు.
- మిధున రాశి: ఈ రాశికి చెందిన సోదరులకు రక్షాబంధన్ రోజున ఆకుపచ్చ రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.
- కర్కాటక రాశి: రక్షాబంధన్ రోజున కర్కాటక రాశి వారికి వీరి సోదరీమణులు తెల్లటి రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు.
- సింహ రాశి: రక్షాబంధన్ రోజున సింహ రాశి వారికి వారి సోదరీమణులు పసుపు లేదా ఎరుపు రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో సూర్యుడు బలపడతాడు.
- కన్య రాశి: రక్షాబంధన్ రోజున కన్యా రాశి వారికి వారి సోదరీమణులు పచ్చ రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధ గ్రహం బలపడుతుంది.
- తులా రాశి: తులారాశి వారు రక్షాబంధన్ రోజున తెల్లటి రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శుక్రుడు, చంద్రుడు బలపడతారు.
- వృశ్చిక రాశి: రక్షాబంధన్ నాడు, వృశ్చిక రాశి వారికి వారి సోదరీమణులు ఎరుపు రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు.
- ధనుస్సు రాశి: ధనుస్సు రాశికి చెందిన సోదరులకు రక్షాబంధన్ నాడు పసుపు రంగు రాఖీని కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు.
- మకర రాశి: మకర రాశికి చెందిన వారికి రక్షాబంధన్ నాడు తమ సోదరీమణులకు నీలం రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శని బలపడి శుభాలు కలుగుతాయి.
- కుంభ రాశి: రక్షాబంధన్ నాడు కుంభ రాశి వారికి వీరి సోదరీమణులు ఆకాశ నీలి రంగు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో శని బలపడుతుంది.
- మీనరాశి: రక్షాబంధన్ నాడు మీన రాశి వారికి వారి సోదరీమణులు పసుపు రాఖీ కట్టాలి. ఇలా చేయడం వల్ల జాతకంలో కుజుడు బలపడతాడు.