ఏపీలో ఈసారి ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. ఎన్నికల హడావిడి మాట అటుంచితే, ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి.ఈ ఘర్షణలను సీరియస్ గా తీసుకున్న ఈసీ సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రస్తుతం సిట్ ఆధ్వర్యంలో శరవేగంగా దర్యాప్తు జరుగుతోంది. ఈ అల్లర్ల నేపథ్యంలో ఆయా జిల్లాల్లో వందల కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో కేసులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించింది సిట్.
ఇప్పటిదాకా 11మంది వైసీపీ నేతలను, 8మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేసినట్లు తెలిపారు పోలీసులు. గురజాల నియోజకవర్గంలో100 కేసులు నమోదు కాగా, 192మంది పేర్లను ఎఫ్ఐఆర్ పొందు పరిచినట్లు తెలిపారు సిట్ అధికారులు. దాచేపల్లి మండలంలో 70కేసులు, పిడుగురాళ్లలో 67మందిపై ఐపీసీ సెక్షన్ 307,324,323 కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సత్తెనపల్లిలో 34కేసులు, నరసరావుపేటలో 20కేసులు, పెదకూరపాడులో 5కేసులు నమోధైనట్లు వెల్లడించింది సిట్.