టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి సిట్ అధికారులు, జూబ్లీహిల్స్ పోలీసులు వెళ్లారు. పేపర్ లీకేజీ కేసులో రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లారు అధికారులు. అయితే అక్కడ రేవంత్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో ఆయన ఇంటికి నోటీసులు అతికించారు. మార్చి 23న ఉదయం 11గంటలకు విచారణకు రావాలని నోటీసులులో పేర్కొన్నారు. అంతకుముందు తనకు నోటీసులు అందలేదని, అందిన తర్వా్త స్సందిస్తానని రేవంత్ అన్నారు. అధారాలు సిట్ కు ఇవ్వనని హైకోర్టు సిట్టి్ంగ్ జడ్జి ద్వారా విచారణ జరిపిస్తే ఇస్తానని తెలిపారు. నోటీసులకు భయపడేది లేదని తేల్చి చెప్పారు.
పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించారు. ఇందులో కేటీఆర్ పాత్ర కూడా ఉందన్నారు. లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్, మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్‌కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్ పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్ ఆరోపించారు.మంత్రి పీఏ తిరుపతే దీనికి ప్రధాన సూత్రధారి అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కేటీఆర్ షాడో సీఎం అయితే, ఆయన పీఏ షాడో మంత్రి అని రేవంత్ అన్నారు.. మంత్రి పీఏ సొంతూరు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలమని, రాజశేఖర్‌ది కూడా ఇదే మండలమని, గ్రూప్1 పరీక్షలో ఈ మండలానికి చెందిన 100 మందికి పైగా 103కు పైగా మార్కులు వచ్చాయని ఆరోపణలు గుప్పించారు. అయితే వీటిపై వివరాలు ఇవ్వాలని సిట్ కోరింది. పేపర్ లీక్ పై ఆరోపణలు చేసే రాజకీయ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేసింది.