ఎన్నికల హింసపై డీజీపీకి సిట్ నివేదిక.. 

ఏపీలో ఎన్నికల అనంతరం నెలకొన్న హింసాకాండపై శరవేగంగా దర్యాప్తు చేసిన సిట్ డీజీపీకి నివేదిక సమర్పించింది.రెండు రోజులపాటు విచారణ జరిపిన సిట్ అల్లర్లు చెలరేగిన ప్రాంతాల్లో పర్యటించి, పరిశీలించి, విచారణ జరిపారు సిట్ అధికారులు. ఆయా ప్రాంతాల్లో నమోదైన కేసుల పైన పోలీస్ అధికారుల నుండి వివరణ పొందిన సిట్ అధికారులు పలు సెక్షన్ల మార్పుకు సిఫార్సు చేశారు. కొత్త ఎఫ్ఐఆర్లు కూడా నమోదు చేయాలని కోరినట్లు నివేదికలో తెలిపారు సిట్ అధికారులు.

నివేదికలో కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించింది సిట్. కొందరు అధికారులు అల్లర్లు చెలరేగుతాయని  తెలిసి కూడా ఆలస్యంగా వెళ్ళినట్టు తెలిపారు సిట్ అధికారులు. స్థానిక నేతలతో కొంతమంది పోలీసులు కుమ్మకైనట్టు సిట్ తన నివేదికలో తెలిపినట్లు తెలుస్తోంది. సిట్ దర్యాప్తు సందర్భంగా దాడుల విషయంలో పలువురు నేతలను, స్థానికులను, పోలీసులను విచారించారు.