తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్​కు ఒక చాన్స్​ ఇవ్వండి: సీతక్క

ములుగు, వెలుగు : తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్​ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని మహిళా కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే సీతక్క కోరారు. పదేళ్ల బీఆర్​ఎస్​ పాలనతో ప్రజలు నలిగిపోయారని విమర్శించారు. మంగళవారం ములుగు మండలం జాకారంలో, ములుగు పట్టణంలో చింతనిప్పుల భిక్షపతి ఆధ్వర్యంలో కాంగ్రెస్​ ఆరు గ్యారంటీ పథకాలపై ప్రచారం నిర్వహించారు. జాకారంలో బీఆర్​ఎస్​ నుంచి 100మంది మహిళలు, యువకులు కాంగ్రెస్​ లో చేరారు. 

ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్​ కుటుంబ పాలనకు చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్​ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మల్లాడి రాంరెడ్డి, కిసాన్​ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు గొల్లపెల్లి రాజేందర్​ గౌడ్, యూత్ కాంగ్రెస్​ అధ్యక్షుడు రవిచందర్, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు వెంకన్న, కాంగ్రెస్​ మండల అధ్యక్షుడు ఎండీ.చాంద్ పాషా, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లెల జయపాల్ రెడ్డి, వర్కింగ్​ కమిటీ అధ్యక్షుడు నల్లెల్ల భరత్, నాయకులు పాల్గొన్నారు. 

అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్సే.. 

వెంకటాపూర్( రామప్ప), వెలుగు : ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నల్లగుంట, గాంపోని పల్లి, లక్ష్మీదేవి పేటకు చెందిన సుమారు250  మందికి మంగళవారం సీతక్క కండువా కప్పి కాంగ్రెస్​ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్​ ప్రభుత్వమేనని అన్నారు.  తనను ఓడించడానికి బీఆర్ఎస్ నాయకులు డబ్బు సంచులతో వస్తున్నారని, కానీ తాను ప్రజలను నమ్ముకున్నానని, తాను గెలిస్తే ప్రజలు గెలిచినట్లు.. బీఆర్​ఎస్​ వాళ్ళు గెలిస్తే డబ్బు గెలిచినట్లని చెప్పారు. కార్యక్రమంలో టీపీసీసీ సభ్యులు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాం రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు భగవాన్ రెడ్డి ఉన్నారు.