లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఎంపీ రమేష్ రాథోడ్ అరెస్ట్ అయ్యారు. అత్యాచార కేసులో ఎంపీ రమేష్ రాథోడ్‌ను గురువారం (జనవరి 30) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మీడియాతో మాట్లాడుతుండగానే కొత్వాలి నగర్ పోలీసులు ఎంపీ రమేష్‌ను అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, పెళ్లి సాకుతో గత నాలుగేళ్లుగా ఎంపీ రాథోడ్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎంపీ రమేష్ రాథోడ్‌పై 2025, జవనరి 17న కేసు నమోదు చేశారు. దీంతో ఎంపీ రమేష్ అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో తనను కావాలనే ఇరికించారని.. పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు.
Also Read :- బావిలో నుంచి వేడి నీళ్లొస్తున్నయ్..!
ఎంపీ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు రిజెక్ట్ చేసింది. రెండు వారాల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంపీ రమేష్ రాథోడ్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించడంతో పోలీసులు దూకుడు పెంచారు. ఈ క్రమంలోనే ఎంపీ రమేష్‌ను గురువారం అరెస్ట్ చేశారు.