
సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu) కూతురు సితార(Sitara) తన బర్త్ డే స్పెషల్ గా.. మహేష్ ఫౌండేషన్ లోని అమ్మాయిలతో సరదాగా గడిపి వారికి సైకిల్స్ ఇచ్చిన విషయం తెలిసేందే. లేటెస్ట్ గా మహేష్ బాబు ఫ్యామిలీ లండన్ ట్రిప్ లో ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో సితార లండన్ ఫేమస్ విధుల్లో చక్కర్లు కొడుతూ ఫొటోస్ కు పోజులిచ్చిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ ఆవుతోన్నాయి. సితారకు ఇంస్టాగ్రామ్, యూట్యూబ్ లో లక్షల్లో ఫాలోవర్స్ ను కలిగి ఉన్న సితార టాప్ సెలెబ్రెటీ డాటర్ గా నిలిచింది. సితార నుంచి ఏ ఫోటో బయటికి వచ్చిన..క్షణాల్లో నెట్టింట్లో వైరల్ అవుతుండటం విశేషం.
రీసెంట్ గా సితార ప్రస్తుతం ప్రముఖ బంగారు నగల తయారీ సంస్థ పిఎంజె జివెల్స్(Pmj jewellers) కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ సంస్థ సితార కలెక్షన్ పేరుతో ప్రత్యేకంగా ఓ స్పెషల్ బ్రాండ్ ను క్రియేట్ చేశారు. దీనికి సంబంధించిన యాడ్ ను న్యూ యార్క్ సిటీలోని టైమ్స్ స్క్వేర్ లో ప్రదర్శించడం ఇప్పుడు ప్రత్యేకతను సంతరించుకుంది. దీంతో అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇది చూసిన మహేష్ అభిమానులు తండ్రికి తగ్గ కూతురు అంటూ కామెంట్స్ తెలిపారు.
ALSO READ:ఓటీటీలో ఒక్కరోజే ఏకంగా 18 సినిమాలు
ఎప్పటికప్పుడు సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉంటూ.. తన డ్యాన్సులతో ఆకట్టుకునే సితార ముందు ముందు సిల్వర్ స్క్రీన్ పై చూసే అవకాశాలు లేకపోలేదు. సొసైటీకు హెల్ప్ చేయడంలో, కమర్షియల్ యాడ్స్ కు నటించడంలో మహేష్ బాబు ని డామినేట్ చేసే లెవెల్ కు సితార చేరిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ తెలుపుతున్నారు.