ఏచూరికి అంత్యక్రియలు లేవు : పార్థీవదేహం ఆస్పత్రికి దానం

ఏచూరికి అంత్యక్రియలు లేవు : పార్థీవదేహం ఆస్పత్రికి దానం

రాజకీయ నేత, సీపీఐఎం అగ్రనేత సీతారాం ఏచూరి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆయనకు అంత్యక్రియలు నిర్వహించటం లేదు కుటుంబ సభ్యులు. ఆయన బతికి ఉన్నప్పుడే.. తాను చనిపోతే.. తన పార్థీవదేహాన్ని వైద్య పరీక్షల కోసం.. వైద్య విద్యార్థుల రీసెర్చ్ కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగానే ఇప్పుడు ఆయన పార్థీవదేహాన్ని ఢిల్లీలోని ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి దానం చేయనున్నారు కుటుంబ సభ్యులు.

మెడికల్ కాలేజీకి ఆయన పార్థీవదేహాన్ని అప్పగించే ముందు.. ఢిల్లీలోని తన ఇంట్లో నివాళులు అర్పించనున్నారు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, పార్టీ కార్యకర్తలు, నేతలు. అనుచరులు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు ఆయనకు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం వ్యక్తం చేశారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో నివాళులు అర్పించిన తర్వాత.. ఆయనకు అంత్యక్రియలు నిర్వహించకుండా.. ఆ పార్థీవదేహాన్ని ఢిల్లీ ఎయిమ్స్ మెడికల్ కాలేజీకి డొనేట్ చేయనున్నారు కుటుంబ సభ్యులు.

ALSO READ | సీతారాం ఏచూరి ఇక లేరు