సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం : స్టూడెంట్ లీడర్ నుంచి జనరల్ సెక్రటరీ వరకు ఇలా..!

సీతారాం ఏచూరి రాజకీయ ప్రస్థానం : స్టూడెంట్ లీడర్ నుంచి జనరల్ సెక్రటరీ వరకు ఇలా..!

సీపీఐ(ఎం).. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్కిస్ట్ పార్టీ.. ఈ పార్టీలో ప్రముఖంగా వినిపించే పేరు సీతారాం ఏచూరి. కమ్యూనిస్టు పార్టీ అగ్రనేతగా ఎంతో గుర్తింపు పొందారు ఆయన. రాజకీయాల్లో ఓనమాలు దిద్దిన పార్టీలోనే.. తుది శ్వాస వరకు ఉన్న లీడర్. స్టూడెంట్ లీడర్ గా రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించి.. ఆ పార్టీకి జాతీయ నేతగా ఎదిగారు. ప్రస్తుతం సీపీఐ ఎం పార్టీకి సెక్రటరీ జనరల్ హోదాలో ఉన్న సీతారాం ఏచూరి.. 72 ఏళ్ల వయస్సులో.. అనారోగ్యంతో కన్నుమూశారు. ఆయన రాజకీయ ప్రస్తానం క్లుప్తుంగా..

ఏచూరి 1952 ఆగస్టు 12న చెన్నైలోని తెలుగు కుటుంబంలో జన్మించారు . ఆయన తండ్రి సర్వేశ్వర సోమయాజుల ఏచూరి, తల్లి కల్పకం ఏచూరి వీళ్ల స్వస్థలం ఆంధ్ర ప్రదేశ్ లోని కాకినాడ. తండ్రి ఏపీఎస్ఆర్టీసీలో ఇంజినీర్ గా, తల్లి ప్రభుత్వ అధికారిగా పని చేశారు.  ఏచూరి బాల్యం హైదరాబాద్ లో  సాగింది.  పదో తరగతి వరకు హైదరాబాద్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్‌లో చదువుకున్నారు. 

ALSO READ | సీతారాం ఏచూరి ఇక లేరు

1969 నాటి తెలంగాణ ఉద్యమం సమయంలో ఆయన ఢిల్లీ వెళ్లి ప్రెసిడెంట్స్ ఎస్టేట్ స్కూల్ లో చేరారు. సీబీఎస్ఈ హయ్యర్ సెకండరీ ఎగ్జామినేషన్‌లో ఆల్-ఇండియా మొదటి ర్యాంక్ సాధించాడు. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ(ఎకనామిక్స్), జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఎంఏ చదివారు.  పిహెచ్‌డీ కోసం జెఎన్‌యులో చేరారు. ఎమర్జెన్సీ సమయంలో అతని అరెస్టుతో అడ్మిషన్  రద్దయింది.  

ఎస్ఎఫ్​ఐ ద్వారా రాజకీయాల్లోకి..

1974లో స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఎఫ్‌ఐ) లో సభ్యుడిగా ఏచూరి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. ఆ మరుసటి ఏడాదే భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్ట్‌) సభ్యునిగా చేరారు. అత్యవసర పరిస్థితికి కొంతకాలం ముందు ఆయన ఆజ్ఞాతంలోకి వెళ్లారు. 

దేశంలో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తర్వాత జేఎన్‌యూ విద్యార్థి నాయకునిగా సీతారాం ఏచూరి మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో అఖిల భారత ఎస్‌ఎఫ్‌ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదిగి, సీపీఎం ప్రధాన కార్యదర్శి అయ్యారు.