సీతారామ ట్రయల్ రన్ సక్సెస్

సీతారామ ట్రయల్ రన్ సక్సెస్

ములకలపల్లి, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలంలోని వీకే రామవరం వద్ద గల సీతారామ ప్రాజెక్ట్‌‌ పంప్‌‌ హౌజ్‌‌ 2 ట్రయల్‌‌ రన్‌‌ సక్సెస్‌‌ అయింది. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించాల్సి ఉండగా టెక్నికల్‌‌ సమస్యల కారణంగా గురువారం రాత్రి 8 గంటలకు ట్రయల్‌‌ రన్‌‌ నిర్వహించారు. 

ముందుగా లిఫ్ట్‌‌ ఇరిగేషన్‌‌ ప్రభుత్వ ముఖ్య సలహాదారు పెంటారెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్‌‌ ఇంజినీర్‌‌ సురేశ్‌‌ కుమార్‌‌ ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో తాండ్ర ప్రభాకర్‌‌రావు, పర్వతనేని అమర్నాథ్, కరటూరి కృష్ణ, పువ్వాల మంగపతి, అడపా నాగేశ్వరరావు ఉన్నారు.