మొగిలిచర్లలో ఘనంగా సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠాపన

మొగిలిచర్లలో ఘనంగా సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠాపన

కురవి, వెలుగు : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్లలో సీతారామ చంద్రస్వామి వారి నూతన ఆలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. నూకల వేణుగోపాల్ రెడ్డి అనిత దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం ధ్వజస్తంభ ప్రతిష్ట, సీతారామచంద్రుల విగ్రహ ప్రతిష్ఠ చేశారు. 

కార్యక్రమానికి డోర్నకల్​ ఎమ్మెల్యే రామచంద్రునాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, మాజీ ఎంపీ ఆర్. సురేందర్ రెడ్డి, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు నెహ్రూ నాయక్, అంబటి వీరభద్రం, బండి వెంకట్ రెడ్డి, కొర్ను రవీందర్ రెడ్డి, సుధాకర్ నాయక్, గార్లపాటి వెంకట్ రెడ్డి, కాలం రవీందర్ రెడ్డి తదితరులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహబూబాద్ రూరల్ సీఐ సర్వయ్య ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.