స్పిరిట్ లో ప్రభాస్ కి జంటగా సీతారామం హీరోయిన్..?

స్పిరిట్ లో ప్రభాస్ కి జంటగా సీతారామం హీరోయిన్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తన్న చిత్రం "స్పిరిట్". ఈ సినిమాకి డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహిస్తున్నాడు.  టి-సీరిస్ బ్యానర్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్స్ పై సందీప్ రెడ్డి, ప్రముఖ సినీ నిర్మాత భూషణ్ కుమార్ కలసి నిర్మిస్తున్నారు. స్పిరిట్ లో ప్రభాస్ పవర్ ఫుల్ కాప్ రోల్ లో నటిస్తున్నాడు. దీంతో సందీప్ రెడ్డి పోలీస్ ఆఫీసర్ రియల్ లైఫ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ కపుల్ సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ కూడా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. 

అయితే ఈ స్పిరిట్ లో ప్రభాస్ కి జంటగా సీతారామం సినిమా ఫేమ్ మృణాల్ ఠాకూర్ నటిస్తున్నట్లు సమాచారం. అయితే మృణాల్ ఠాకూర్ కి సౌత్ లో కూడా మంచి ఫేమ్ ఉంది. దీంతో మృణాల్ ని సెలక్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే మొదటగా ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందాన ని తీసుకోవాలనుకున్నప్పటికీ డేట్లు అడ్జస్ట్ కాకపోవడంతో మృణాల్ ని ఖాయం చేసినట్లు టాలీవుడ్ సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

ALSO READ | 10వ రోజు కూడా కలెక్షన్లు తగ్గేదేలా... రూ.1292 కోట్లు కొల్లగొట్టిన పుష్ప రాజ్

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం స్పిరిట్ కి సంబందించిన మ్యూజిక్ కంపోజింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే ప్రభాస్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. దీంతో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పిరిట్ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. అయితే స్పిరిట్ సినిమాలో మరో పోలీస్ ఆఫీసర్ పాత్రలో హాలీవుడ్ హీరో డాంగ్ లీ కూడా నటిస్తున్నట్లు పలు రూమర్స్ వినిపిస్తున్నాయి. కానీ ఈ విషయంపై స్పిరిట్ చిత్ర యూనిట్ స్పందించలేదు.