భద్రాచలం, వెలుగు: శ్రీరామనవమి రోజున భద్రాద్రి మిథిలాస్టేడియంలో జరిగే సీతారాముల కల్యాణ వేడుకలను వైభవంగా నిర్వహిస్తారు. ఈ కల్యాణ వేదికను 1964లో ఏకశిలతో నిర్మించారు. కానీ ఈ మండపంపై దేవస్థానం నిర్లక్ష్యం చేస్తోంది. రక్షణ ఏర్పాట్లు చేయాల్సిన ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు.
మండపంలోకి కుక్కలు తిరుగుతున్నాయి. కల్యాణం నిర్వహించే అర్చకులు, వేదపండితులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు. -