కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ACB అధికారులకు పట్టుబడ్డాడు ఓ సైట్ ఇంజనీర్. రంగారెడ్డి జిల్లా మాంబా పూర్ గ్రామంలో జిల్లాపరిషత్ హైస్కూల్ లో 4 టాయిలెట్స్ నిర్మించేందుకు కట్టడానికి శ్రీనివాస్ అనే వ్యక్తికి కాంట్రాక్టు ఇచ్చారు అధికారులు. పనులు పూర్తయినా బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ శ్రీనివాస్.. మూడు లక్షల బిల్లుల కోసం రంగారెడ్డి జిల్లా సైట్ ఇంజనీర్ వినోద్ ను ఆశ్రయించాడు. అయితే బిల్లు పాస్ కావాలంటే లంచం ఇవ్వాల్సిందే నని డిమాండ్ చేశాడు వినోద్. ఏడు వేల రూపాయలకు ఇచ్చేలా ఒప్పదం కుదుర్చుకున్నాడు శ్రీనివాస్. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని కాంట్రాక్టర్.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
లక్డికపుల్ లోని ఫారీద్ మీర్జా అపార్ట్మెంట్ లోని టీఎస్ ఎడ్యుకేషన్ అండ్ వెల్ఫేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రంగారెడ్డి జిల్లా కార్యాలయంలో వినోద్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ACBకి పట్టుబడ్డాడు. వినోద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించనున్నట్లు ACB DSP సూర్యనారాయణ తెలిపారు.