బాల్కొండ,వెలుగు : ముప్కాల్ లో ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి శుక్రవారం ఆర్డీవో రాజా గౌడ్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో రమేశ్ స్థల పరిశీలన చేశారు. ముప్కాల్ కు హాస్పిటల్మంజూరైంది. దీంతో అనువైన హాస్పిటల్ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని ఆర్డీవో తెలిపారు.
కార్యక్రమంలో పోచంపాడ్ క్లస్టర్ ఇన్చార్జి రాకేశ్, వీడీసీ ప్రెసిడెంట్ సిద్ధ రమేశ్,సెక్రటరీ నేర నర్సయ్య, గ్రామ పరిరక్షణ సమిటీ ప్రెసిడెంట్ శ్రీకాంత్ యాదవ్,సెక్రటరీ సంజీవ్ థామస్ పాల్గొన్నారు.