హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన

హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణానికి స్థల పరిశీలన

అశ్వాపురం, వెలుగు : మండల పరిధిలోని నెల్లిపాక పంచాయతీ పరిధిలోని రాళ్లవాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణం కోసం మేరకు గురువారం పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు నెల్లిపాక బంజర రైతులతో కలిసి రాళ్లవాగు ప్రదేశాన్ని సందర్శించారు. వాగుపై హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించారు. నెల్లిపాక నుంచి ఆనందపురం గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గంలో ఉన్న ఈ వాగుపై హై లెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయించి, త్వరలో పనులు ప్రారంభిస్తామని చెప్పారు.

కార్యక్రమంలో ఎంపీపీ ముత్తినేని సుజాత, రామచంద్రపురం ఎంపీటీసీ గాదె జయ కాంగ్రెస్ లీడర్లు ఓరుగంటి రమేశ్, వేములపల్లి రమేశ్, బిక్కసాని సత్యనారాయణ, అక్కిన అచ్యుతరావు, బురెడ్డి వెంకట్​రెడ్డి తూము రాఘవులు నరేశ్​ యూత్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.