హెచ్-సిటీ కోసం స్థలాల పరిశీలన.. ఐటీ కారిడార్లో భూసేకరణ ముమ్మరం

హెచ్-సిటీ కోసం స్థలాల పరిశీలన.. ఐటీ కారిడార్లో భూసేకరణ ముమ్మరం

గచ్చిబౌలి, వెలుగు: శేరిలింగంపల్లి జోన్​లో హెచ్ సిటీ ప్రాజెక్టులో భాగంగా చేపట్టబోయే అభివృద్ధి పనులకు సంబంధించి స్థలాలను ఆదివారం హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, బల్దియా కమిషనర్ ఇలంబరితి, మున్సిపల్​శాఖ డిప్యూటీ సెక్రటరీ ప్రియాంక, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి, సైబరాబాద్ ట్రాఫిక్​ జాయింట్ సీపీ జోయల్​డేవిస్​పరిశీలించారు. 

ఖాజాగూడ జంక్షన్, సీపీ ఆఫీస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్, ట్రిపుల్​ఐటీ జంక్షన్, విప్రో జంక్షన్, కాంటిన్జెంట్ జంక్షన్, డీఎల్ఎఫ్ రోడ్, మజీద్ బండ(బొటానికల్ గార్డెన్), చందానగర్ రైల్వే స్టేషన్, లింగంపల్లి ఫ్లైఓవర్, శ్రీదేవి టాకీస్, గంగారం రోడ్డు, ఆల్విన్ ఎక్స్ రోడ్ ప్రాంతాల్లో ప్రతిపాదించిన పనుల కోసం స్థలాలను బస్సులో వెళ్లి పరిశీలించారు. భూసేకరణ పనులు ముమ్మరం చేయాలని, ఆయా శాఖలకు సంబంధించిన యుటిలిటీ విద్యుత్, వాటర్ వర్క్స్, టెలిఫోన్ వైర్లు తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. 

చీఫ్ ఇంజనీర్ భాస్కర్ రెడ్డి, టీఎస్​పీడీసీఎల్​ఆఫీసర్లు శేఖర్, పాండ్యన్, జోనల్ కమిషనర్ ఉపేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ రఘు ప్రసాద్, వేణు గోపాల్ రెడ్డి, టీఎస్​ఐఐసీఎండీ విష్ణువర్ధన్ రెడ్డి పాల్గొన్నారు.