జీవన్ రెడ్డికే మళ్లీ చాన్స్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టికెట్పై పీసీసీ తీర్మానం

హైదరాబాద్: కరీంనగర్,నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని పీసీసీ ఖరారు చేసింది. ఈ మేరకు తీర్మానం చేసి ఆమోదం కోసం ఏఐసీసీకి పంపింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ గాంధీభవన్ లో ఈ నాలుగు జిల్లాల పార్టీ ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్బంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించామని అన్నారు. పది నెలల  కాలంలో 53 వేల ఉద్యోగాలను ప్రభుత్వం ఇచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలతో  పాటు ప్రైవేటు సెక్టార్ లోనూ ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 

ALSO READ | ఫుడ్ పాయిజన్పై టాస్క్ ఫోర్స్.. బాధ్యులను తేల్చనున్న రాష్ట్ర ప్రభుత్వం

అభ్యర్థి ఎంపిక తుది నిర్ణయం పార్టీ హైకమాండ్ దేనని, తుది నిర్ణయం అధిష్టానమే తీసుకుంటుందని చెప్పారు.  ఈ సమావేశంలో  పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి దీపాదాస్ మున్షి, మంత్రులు కొండా సురేఖ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు.