
లైంగిక వేదింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ లోక్ సభ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. కర్ణాటకలో సిట్టింగ్ ఎంపీగా ఉన్న హాసన్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన JD(S) రేవణ్ణ .. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ ఎం. పటేల్ పై 42వేల 649 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నా కర్ణాటక రాష్ట్రంలో బీజేపీ, జేడీఎస్ కూటమిగా పోటీ చేశాయి. బీజేపీ దాదాపు 20 సీట్లలో, కాంగ్రెస్ 9 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
బెంగళూరు సెక్స్ స్కాండల్ ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఇండియాకు తిరిగొచ్చారు. జర్మనీలోని మ్యూనిచ్ నుంచి గురువారం సాయంత్రం బయలుదేరిన ఎంపీ.. బెంగళూరు కెంపెగౌడ ఎయిర్ పోర్టులో అర్ధరాత్రి ల్యాండయ్యారు. ప్రజ్వల్ కోసం ఎయిర్ పోర్టులో వేచి ఉన్న సిట్ అధికారులు ఎంపీని అదుపులోకి తీసుకున్నారు.
రాత్రి ఒంటిగంటకు ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను అరెస్టు చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. అంతకుముందు.. జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తిరిగి వస్తున్నట్లు తెలియడంతో సిట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ విషయాన్ని కర్నాటక హోంమంత్రి జి.పరమేశ్వర నిర్ధారించారు. ప్రజ్వల్ ఎక్కిన విమానం జర్మనీలోని మ్యూనిచ్ నుంచి సాయంత్రం 4:10 గంటలకు (భారత కాలమానం) బయలుదేరిందని, బెంగళూరులోని కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు రాత్రి 12:30 గంటలకు చేరుకుంటుందని వివరించారు. దీంతో సిట్ అధికారులు పలు టీమ్లు గా ఏర్పడి గురువారం రాత్రి కెంపెగౌడ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు.