
శివ పరమాత్మునికి చేసే పూజల్లో రుద్రాభిషేకం చాలా ప్రధానమైనది.. చాలా ముఖ్యమైనది.. విశిష్టమైనది.. అందుకే ప్రతి శివాలయంలో నిత్యం బ్రహ్మముహూర్తంలో అభిషేకం చేస్తుంటారు. అంతేకాదు.. శాంతి పూజలకు.. జాతక రీత్యా దోష నివారణ పూజలు చేసేటప్పుడు...తప్పకుండా పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహిస్తారు. అయితే .రుద్రాభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
హిందువుల పండుగల్లో శివరాత్రి చాలా పండుగ చాలా ముఖ్యమైనది.. ఎందుకంటే ఈ పండుగ రోజంతా... ఉపవాసం ఉండి.. భగవత్ ధ్యానంలో గడుపుతారు. సృష్టి కర్త.. లయకారుడు.. పరమేశ్వరునికి అభిషేకాలు.. ప్రత్యేక పూజలు.. శివపార్వతుల కళ్యాణం పల్లెల్లో ప్రభలతో ఊరేగిస్తూ దేవాలయాలకు వెళ్తారు. ఆ తరువాత స్వామివారికి చేయాల్సిన పూజలను నిర్వహిస్తారు.
రుద్రాభిషేకం పూజ..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులందరూ శివుడిని అనేక పేర్లతో కొలుస్తారు. హిందువుల పండుగలలో మహా శివరాత్రికి ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణంగా శివుడిని శివ లింగం రూపంలో పూజిస్తారు. రుద్ర తాండవం, శివుని కనికరం లేని స్వభావంగా భావిస్తారు. అయితే వాటిలో ప్రముఖమైనది రుద్రుడు. శివుని రుద్ర స్వరూపం ఉగ్రమైనది. శివపరమాత్మునికి ఇష్టమైన పూజా రుద్రాభిషేకం అని పండితులు చెబుతారు. రుద్రాభిషేకం చేసే సమయంలో కొన్ని నియమాలు కచ్చితంగా పాటించాలి. అప్పుడే మీరు చేసిన అభిషేకం నుండి ఫలితం వస్తుంది. శివుడికి అభిషేకం చేసే సమయంలో ఎలాంటి నియమాలను పాటించాలో తెలుసుకుందాం. . . .
పాటించాల్సిన నియమాలు..
రుద్రాభిషేకం సమయంలో చెరువులో నుండి లేదా బావిలో నుండి తెచ్చిన బిందెలతో తీసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేస్తుంటారు. ఇలా చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే చెరువులలో లేదా బావిలోని నీటిలో విషపదార్థాలు ఉండటం వల్ల మీరు ఆ జలంతో చేసిన అభిషేకం ఫలితం శూన్యంగా మారిపోతుంది. కాబట్టి మీరు శివుడికి రుద్రాభిషేకం చేసే సమయంలో కలశంలో ఉంచిన శుభ్రమైన నీటితో అభిషేకం చేయాలని పండితులు చెబుతున్నారు. రుద్రాభిషేకంలో భాగంగా పాలు, గంగాజలం, పెరుగు, చెరుకు రసం, గంధపు పొడి వంటి పవిత్ర ద్రవాల మిశ్రమంతో అభిషేకం చేయాలి. ఈ సమయంలో సానుకూల శక్తులు ఉంటాయని చాలా మంది నమ్ముతారు.
రుద్రాభిషేక పూజకు కావాల్సిన పదార్థాలు.. అభిషేక ద్రవాలు
- గంగాజలం.... గులాబీ నీళ్లు... ఆవు పాలు... చెరకు రసం .. పండ్ల రసాలు కలిపిన నీరు
- పంచామృతం అంటే ఆవుపాలు.. పెరుగు... తేనె... చక్కెర...ఆవు నెయ్యి
- గంగాజలం కలిపిన నీటిని చిలకరించడానికి చిన్న కుశ( గడ్డి) .. ఒక స్పూన్
- ధూపం... కర్పూరం... నేతి దీపం
- గంధపు పొడి... సుగంధ నూనెలు, అగర్ బత్తీలు(సువాసన వెదజల్లేవి).. అక్షింతలు(బియ్యం)
- నైవేద్యాలు : స్వీట్లు, పూలు, పండ్లు, యాపిల్ చెట్టు ఆకులు, తమలాపాకులు, కొబ్బరి
- స్వామివారికి బట్టలు ( పంచ.. కండువ)
శివరాత్రి రోజు శివాలయంలో పూజ ఎలా చేయాలంటే..
- మహా శివరాత్రి రోజున హిందువులందరూ తప్పనిసరిగా శివాలయానికి వెళ్లాలి.
- ఓం నమః శివాయఅనే మంత్రాన్ని జపిస్తూ శివుడికి
- శివలింగానికి కచ్చితంగా జలాభిషేకం చేయాలి.
- పూజ అనంతరం స్వామివారికి ఇచ్చే నివేదనలో తప్పనిసరిగా పులిహార ఉండేలా చూసుకోవాలి
- శివ లింగానికి పంచామృతాన్ని సమర్పించాలి.
- మారేడు ఆకులతో శివుడిని ఆరాధించాలి
- శివరాత్రి ఉపవాసం, జాగరణకు ఎంతో ప్రాముఖ్యత ఉంది
- ఉపవాసం ఉండే వారు కేవలం పండ్లు, పాలు వంటి సాత్విక ఆహారమే తీసుకోవాలి
- పురుషుడు శివుని గర్భగుడిలోకి వెళ్లే సమయంలో చొక్కా, ప్యాంట్ వేసుకోకూడదు. పంచ.. కండువాలను ధరించాలి
- మహా శివరాత్రి రోజున పేదలకు అన్నదానం, ఇతరుల దాన ధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.
- శివుడికి చందనం, విభూదిని పెడితే సరిపోతుంది.
- నాగమల్లి పువ్వులంటే శివుడికి ఎంతగానో ఇష్టం. ఈ పువ్వులతో శివరాత్రి రోజున పూజ చేస్తే.. శివుని అనుగ్రహం దక్కుతుంది.