అమరన్’ చిత్రంతో మరో సూపర్ హిట్ అందుకున్న శివ కార్తికేయన్.. తన కెరీర్‌లో మైల్ స్టోన్ మూవీకి చేరువయ్యాడు. తను హీరోగా తెరకెక్కనున్న 25వ చిత్రాన్ని అనౌన్స్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. జయం రవి, అథర్వ కీలకపాత్రలు పోషిస్తున్నారు.
శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘శివ కార్తికేయన్ మైల్ స్టోన్ మూవీని నిర్మించడం.. జయం రవి, అథర్వ, శ్రీలీల ఇందులో నటిస్తుండడం సంతోషంగా ఉంది. యూనిక్ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్‌ను అందించే సినిమా అవుతుందనే నమ్మకం ఉంది’ అని చెప్పారు. ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా తనకు ఇది 100వ సినిమా కావడం విశేషం.