రామ్ చరణ్ సినిమాలో.. శివ రాజ్‌‌‌‌కుమార్

ఓవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే.. ఇతర హీరోల సినిమాల్లోనూ కీలక పాత్రలతో మెప్పిస్తున్నారు కన్నడ స్టార్ శివ రాజ్‌‌‌‌కుమార్. గత ఏడాది ‘జైలర్‌‌‌‌‌‌‌‌’లో కీరోల్ చేసిన ఆయన... ఇప్పుడు రామ్ చరణ్‌‌‌‌ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు. శుక్రవారం శివ రాజ్‌‌‌‌కుమార్  పుట్టినరోజు  సందర్భంగా ఈ విషయాన్ని అనౌన్స్ చేశారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న  చిత్రంలో ఆయన పవర్‌‌‌‌‌‌‌‌ఫుల్ పాత్ర పోషిస్తున్నారు.

దీంతో ఈ ఇద్దరి హీరోలను తెరపై ఎలా ప్రెజెంట్ చేస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. చరణ్‌‌‌‌ కెరీర్‌‌‌‌‌‌‌‌లో ఇది 16వ చిత్రం. జాన్వీ కపూర్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.  మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌‌‌‌పై  వెంకట సతీష్ కిలారు భారీ బడ్జెట్‌‌‌‌తో దీన్ని నిర్మిస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో రూపొందుతున్న ఈ సినిమాకి  ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.