Most Liked Telugu Web Series: ఇండియాలో ఎక్కువ మంది మెచ్చిన తెలుగు వెబ్ సిరీస్ ఇదే..సీజన్ 2, 3 రెడీ!

Most Liked Telugu Web Series: ఇండియాలో ఎక్కువ మంది మెచ్చిన తెలుగు వెబ్ సిరీస్ ఇదే..సీజన్ 2, 3 రెడీ!

#90’s మిడిల్ క్లాస్ బయోపిక్ (#90's A Middle Class Biopic) వెబ్ సిరీస్ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రతేకంగా చెప్పాల్సిన పనిలేదు. దర్శకుడు ఆదిత్య హాసన్(Adithya Haasan) తెరకెక్కించిన ఈ సిరీస్ లో శివాజీ(Shivaji), వాసుకి ఆనంద్ సాయి(Vasuki Anand Sai), మౌళి(Mouli), రోహన్ రాయ్(Rohan Roy) ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రముఖ ఓటీటీ ఛానెల్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ సూపర్ సిక్స్ అయ్యింది. 

తాజా విషయానికి వస్తే..ప్రముఖ ఆర్మాక్స్ మీడియా 2024 తొలి అర్ధభాగంలో తెలుగులో అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చిన వెబ్ సిరీస్ ల జాబితాను తాజాగా రిలీజ్ చేసింది. ఆర్మాక్స్క్స్‌ పవర్‌ రేటింగ్‌ (ఓపీఆర్‌) ప్రకారం ఈ సిరీస్‌ 83 రేటింగ్‌ని సొంతం చేసుకుంది. కోటా ఫ్యాక్టరీ, పంచాయత్‌, బిఖీబి లాంటి సిరీస్‌లు కూడా 90s ముందు తేలిపోయాయి. దీంతో ఇండియాలో ఎక్కువ మంది లైక్ చేసిన తెలుగు వెబ్ సిరీస్ గా #90's-ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ నిలిచింది. ఈ సందర్భంగా 90's తెరకెక్కించిన ఈటీవీ విన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతూ పలు విషయాలను పంచుకుంది. 

ఇందులో తాము తెరకెక్కించిన #90's వెబ్ సిరీస్ నంబర్ వన్ గా నిలిచినట్లు ఈటీవీ విన్ ఓటీటీ వెల్లడించింది. అలాగే, తెలుగు ఓటీటీల్లో రికార్డు బ్రేకింగ్ హిట్ గా తమ మిడిల్ క్లాస్ బయోపిక్ నిలిచినట్లు తెలిపింది. అంతేకాకుండా ఇప్పటికీ తెలుగులో వచ్చిన ఎన్నో సిరీస్ లను దాటి ఇండియాలోనే ఎక్కువ మంది మెచ్చిన వెబ్ సిరీస్ గా #90's నిలిచేలా చేసిన ప్రేక్షకులు, నటీనటులు, టెక్నీకల్ టీమ్ కి, దర్శకుడు ఆదిత్య హాసన్ కి ఈటీవీ విన్ థ్యాంక్స్ చెప్పింది. ఇకపోతే, ఈ సిరీస్‌కి కొనసాగింపుగా 2, 3 భాగాలను వచ్చే ఏడాదిలో తీసుకొస్తామని..మరింతగా మీ మనసులని గెలవడానికి ప్రయత్నిస్తామని ప్రకటించింది. దీంతో 90’s మిడిల్ క్లాస్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. 

ఫ్యామిలీ, కామెడీ అండ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. ఈ సిరీస్ లో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. మరీ ముఖ్యంగా శివాజీ చిన్న కొడుకుగా నటించిన రోహన్ రాయ్ తెగ వైరల్ అయ్యాడు. అల్లరి పిల్లాడిగా ఆ పాత్రలో రోహన్ అద్భుతంగా నటించాడు. తన క్యూట్ క్యూట్ నటనతో, డైలాగ్స్ తో ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. అలాగే మౌళి, వాసంతిక బీహైన్డ్ స్టోరీస్ కూడా సహజమైన కథనాలతో ఆకట్టుకున్నాయి.