Madharasi: శివకార్తికేయన్-మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్.. ‘మదరాసి ’ రిలీజ్ డేట్ అనౌన్స్

Madharasi: శివకార్తికేయన్-మురుగదాస్ యాక్షన్ థ్రిల్లర్.. ‘మదరాసి ’ రిలీజ్ డేట్ అనౌన్స్

అమరన్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న శివకార్తికేయన్, వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్దర్శకత్వంలో తన నెక్స్ట్ మూవీ చేయబోతున్నాడు. ఈ సినిమా ‘మదరాసి ’(Madharasi) అనే టైటిల్తో సామాజిక అంశాలతో యాక్షన్ థ్రిల్లర్గా తెరకెక్కనుంది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. సెప్టెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. త్వరలో చివరి షూటింగ్ షెడ్యూల్ని స్టార్ట్ చేస్తామని, ఆ తర్వాత పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తామని మేకర్స్ వెల్లడించారు. ఇటీవలే, డైరెక్టర్ మురుగదాస్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తో సికిందర్ తీసి డిజాస్టర్ మూటగట్టుకున్నాడు. ఈ 'మదరాసి' సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. శివకార్తికేయన్ కెరీర్‌‌‌‌లో ఇది 23వ సినిమాగా రానుంది.

మదరాసి సినిమాలో రుక్మిణీ వసంత్‌‌ హీరోయిన్‌‌గా నటిస్తోంది. విద్యుత్ జామ్వాల్, బిజు మీనన్, షబీర్, విక్రాంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా సుదీప్ ఎలామోన్ సినిమాటోగ్రాఫర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. 

ఇకపోతే, శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కనున్న 25వ చిత్రాన్ని ఇటీవలే అనౌన్స్ చేశారు. నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగర దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు పరాశక్తి అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు. జయం రవి, అథర్వ కీలకపాత్రలు పోషిస్తున్నారు.

ALSO READ : హిట్: ది థర్డ్ కేస్‌‌‌‌: యాక్షన్ ప్రియులకు ఫుల్‌‌‌‌ మీల్స్‌‌‌‌

శ్రీలీల హీరోయిన్‌‌గా నటిస్తోంది. డాన్ పిక్చర్స్ బ్యానర్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శివ కార్తికేయన్ ఒక స్టూడెంట్ లీడర్ గా కనిపించనున్నారు. జయం రవి క్రూరమైన విలన్ పాత్రలో నటిస్తున్నాడు.