Amaran: అమరన్ ట్విట్టర్ రివ్యూ.. శివ కార్తికేయన్, సాయిపల్లవి సినిమా టాక్ ఎలా ఉందంటే?

తమిళ్ ప్రముఖ హీరో శివకార్తికేయన్, బ్యూటిఫుల్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం అమరన్. ఈ చిత్రాన్ని దివంగత ఆర్మీ లెఫ్టనెంట్ ముకుంద్ వరదరాజన్ జీవితగాథ ఆధారంగా తమిళ్ దర్శకుడు రాజ్ కుమార్ పెరిసామి తెరకెక్కించారు.

ప్రముఖ హీరో కమల్ హాసన్ మరియు సినీ నిర్మాణ సంస్థ సోనీ పిక్చర్స్ కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించగా ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. ఈ మూవీలో శివకార్తికేయన్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ పాత్రలో కనిపించనున్నాడు. సాయి పల్లవి ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ మూవీ చూసిన ఆడియన్స్ ట్విట్టర్లో షేర్ చేసుకున్న ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. 

దేశం కోసం ఆర్మీ మేజ‌ర్ ముకుంద్ వ‌ర‌ద‌రాజ‌న్ చేసిన త్యాగం, ఆయన అస‌మాన పోరాటాన్ని అమ‌ర‌న్ మూవీలో ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ పెరియాసామి చ‌క్క‌గా చూపించాడ‌ని నెటిజ‌న్లు పోస్టులు చేస్తున్నారు.ఇందు రెబెకా జాన్ పాత్ర‌లో సాయిప‌ల్ల‌వి క్యారెక్ట‌ర్, యాక్టింగ్ అమ‌ర‌న్‌ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్‌పాయింట్‌ అని నెటిజ‌న్లు ట్వీట్స్ చేస్తోన్నారు. శివ‌కార్తికేయ‌న్‌, సాయిప‌ల్ల‌వి కాంబోలో వ‌చ్చే ప్ర‌తీ సీన్ ఆడియెన్స్‌ను మెస్మ‌రైజ్ చేస్తుంద‌ని అంటున్నారు. 

భారత ఆర్మీ స్టాఫ్‍కు అమరన్ సినిమా ప్రీమియర్‌ను మూవీ టీమ్ ఇటీవల నిర్వహించింది. ఈ ప్రీమియర్లకు చాలా మంది సైనికులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి ఈ మూవీ గురించి సోషల్ మీడియాలో రివ్యూ రాశారు. మూవీ స్క్రిప్ట్, డైరెక్షన్, యాక్టింగ్.. స్ఫూర్తివంతమైన అశోక చక్ర గ్రహీత మేజర్ ముకుంద్ జీవితం చాలా చక్కగా చూపించారని తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. 

ఈ సినిమా భారత ఆర్మీకి పర్ఫెక్ట్ ట్రిబ్యూట్ అని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. భారత సైనికుల ధైర్య సాహసాలను తెరపై చక్కగా ఆవిష్కరించారని కొనియాడారు. గుండెల్లో దేశభక్తి కలిగించే మూవీస్ తరహాలో ఈ సినిమా ఎప్పటికీ నిలిచిపోతుందని ఓ నెటిజన్ ట్వీట్ చేశాడు. 

శివకార్తికేయన్ ఇన్నాళ్లు.. తన ఫన్ తో.. పక్కింటి అబ్బాయి తరహాలో వినోదభరితంగా నటించి మెప్పించాడు. కానీ మొదటిసారిగా ఎంతో భారమైన పాత్రలో ఒదిగిపోయి.. నటించడం చాలా బావుందని తెలిపారు. అలాగే తనకు మంచి భవిష్యత్తు ఉంటుందని ట్వీట్ చేశాడు. 


మరో నెటిజన్ ట్వీట్ చేస్తూ.. 'సీతారామం' సినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంట మధ్య కెమిస్ట్రీ ఎంత అద్భుతంగా కుదిరిందో? ఈ సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కూడా కెమిస్ట్రీ అంతే సూపర్బ్ గా ఉందని తెలిపాడు. ఈ కపుల్ టాక్ ఆఫ్ ది టౌన్ అవుతారని' తన ఫీలింగ్ ని షేర్ చేశాడు.