ప్రతి ఇండియన్‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా..

ప్రతి ఇండియన్‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా..

శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటిస్తున్న చిత్రం  ‘అమరన్‌‌‌‌‌‌‌‌’.  సోనీ పిక్చర్స్‌‌‌‌‌‌‌‌తో కలిసి కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ నిర్మిస్తున్నారు.  రాజ్‌‌‌‌‌‌‌‌కుమార్ పెరియసామి దర్శకుడు.  దీపావళి కానుకగా అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌31న సినిమా విడుదల కానుంది. తాజాగా చిత్రంలోని పాత్రలను పరిచయం చేస్తూ చెన్నైలో ప్రెస్‌‌‌‌‌‌‌‌మీట్ నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శివ కార్తికేయన్ మాట్లాడుతూ ‘ఈ కథ విన్నాక నిద్ర పట్టలేదు.  టెర్రరిస్ట్ అటాక్‌‌‌‌‌‌‌‌లో  అమరుడైన మేజర్ ముకుంద్ వరదరాజన్ పాత్రలో నేను నటించా. అలాగని కంప్లీట్ వార్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌లో ఉండదు.

సైనికుల ట్రైనింగ్, వారి చాలెంజెస్‌‌‌‌‌‌‌‌ను చూపించాం. ఆర్మీ ఆఫీసర్ పాత్ర పోషించేందుకు మొదట్లో కష్టమనిపించింది.  కశ్మీర్ వెళ్లి సైనికుల బాధ్యతల గురించి తెలుసుకున్న తర్వాత నేను పడిన కష్టం తక్కువనిపించింది’ అని చెప్పాడు. ఇందులో ఆర్మీ ఆఫీసర్ ముకుంద్ భార్యగా  రెబెకా పాత్రలో కనిపించనున్నట్టు సాయి పల్లవి చెప్పింది. ఈ చిత్రం ప్రతి ఇండియన్‌‌‌‌‌‌‌‌కు నచ్చేలా ఉంటుందని దర్శకుడు రాజ్ కుమార్ పెరియసామి,  కమల్ హాసన్ అన్నారు.  శ్రేష్ఠ్ మూవీస్ సంస్థ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది.  జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.