Amaran: అమరన్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. చీఫ్ గెస్ట్గా ఇండియన్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్

తమిళ స్టార్ శివ కార్తికేయన్ (Siva Karthikeyan) హీరోగా వస్తన్న లేటెస్ట్ మూవీ అమరన్ (Amaran). మేజర్ ముకుంద్ వరదరాజన్ (Mukund Varadharajan) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి (Rajkumar Periyaswami) తెరకెక్కించాడు.

లోకనాయకుడు కమల్ హాసన్ (Kalam Haasan) నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి (Sai Pallavi) హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ దీపావళి కానుకగా అక్టోబర్ 31న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 
 
ఈ నేపథ్యంలో అమరన్ మూవీ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికను ఖరారు చేసారు. ఇవాళ శనివారం అక్టోబర్ 26న సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ లోని ITC ఖోహినూర్ హోటల్ లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ పోస్టర్ రీలీజ్ చేసారు. ఈ వేడుకకు అమరన్ టీంతో పాటుగా..ఇండియన్ బ్లాక్ బాస్టర్ హిట్ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ ముఖ్య అతిధిగా రానున్నారు. అలాగే లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి కూడా హాజరు కానుంది. దాంతో ఈ వేడుక ఎలాంటి ప్రాధాన్యత సంతరించుకోనుందో అర్థమైపోతుంది. 

అమరన్ ట్రైలర్:

ఇక అమరన్ చిత్రంలో శివకార్తికేయన్ పవర్ఫుల్ ఆర్మీ ఆఫిసర్ పాత్రలో కనిపించనున్నాడు. సాయి పల్లవి ముకుంద్ వరదరాజన్ భార్య ఇందు రెబెకా వర్గీస్ పాత్రలో నటించింది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది. హీరో శివకార్తికేయన్ తన కూతురితో ఆడుకుంటున్న సన్నివేశాలతో ట్రైలర్ స్టార్ట్ అవుతుంది.

ఆ తర్వాత నింగి ఆకాశం మధ్యన ఉండే దూరమే మన ఇద్దరి ప్రేమ అంటూ సాయి పల్లవి చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. ఇక ఆర్మీ ఆపరేషన్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలతో అలరించాడు శివకార్తికేయన్. ఈ క్రమంలో ఆర్మీ అంటే జాబ్ కాదు ఇట్స్ ఎ లైఫ్ అంటూ చెప్పే డైలాగులు ఆడియన్స్ కట్టి పడేశాయని చెప్పవచ్చు.

మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ బీజీఎంతో తన మార్క్ ని అందుకున్నారు. ఓవరాల్ గా దేశభక్తి, ఫ్యామిలీ ఎమోషన్స్ తో కట్ చేసిన ట్రైలర్ అమరన్ సినిమాపై ఆసక్తిని పెంచిందని చెప్పవచ్చు.