
హిందువులు శివుడిని ఆరాధిస్తారు. శివరాత్రి రోజు ( ఫిబ్రవరి 26).. దాదాపు ప్రతి శివాలయంలో పరమేశ్వరుడికి అభిషేకం.. కళ్యాణం నిర్వహిస్తారు. ఆ పరమేశ్వరుడిని ముల్లోకాలలో పూజిస్తారు. ప్రతి లోకానికి ఆది.. అంతం రెంటిని కూడా పరమేశ్వరుడు చూస్తాడని శివ పురాణంలో వివరించారు. శివయ్య ముందు ఏశక్తి అయినా పటా పంచలు కావాల్సిందే.. అసలు పరమేశ్వరుడు ఎవరు..? ఆయన ఎలా జన్మించాడు.. ఆయన తల్లిదండ్రులు ఎవరు? గురువు ఎవరు? ఇలాంటి విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. . . .
పురాణాల ప్రకారం.. ఒకానొక సమయంలో బ్రహ్మ, విష్ణు మధ్య రాక్షసుల బాధలు ఎక్కవయ్యాయి. చాలా బాధలు పడుతున్నాం.. దైవ కన్యలను అవమానపరుస్తున్నారు. వీరి ఆగడాలను ఎలా అరికట్టాలి.. అనే విషయంలో బ్రహ్మ, విష్ణువు ఇద్దరు చర్చించుకుంటున్నారు. అలా వారిద్దరు మాట్లుడుకుంటుండగా హఠాత్తుగా మండుతున్న అగ్నిగోళంలా మహాదేవుడు వారి మధ్యకు వచ్చాడని బ్రహ్మ పురాణంలో ఉంది. ఆయన రావడంతోనే ఓ పెద్ద శబ్దంవచ్చింది. ఆ అగ్నిగోళం ఒక పెద్ద స్థంభంగా ఏర్పడింది. అప్పుడు పరమేశ్వరుడు మీరిద్దరు గొప్పవారు కదా.. ఈ స్థంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోండి.. ఇక మీదట వారే గొప్పవారుగా చెలామణి అవుతారని పరమేశ్వరుడు వారితో అన్నాడు.
అప్పుడు వెంటనే బ్రహ్మ ఒక పక్షి రూపం తీసుకున్నాడు. ఆ స్తంభానికి దారి కనుక్కోవడానికి బయలుదేరతాడు. మరోవైపు విష్ణువు వరాహ రూపం ధరించి స్తంభానికి అంతం ఎక్కడుందో కనుక్కోవడానికి బయలుదేరాడు. చాలా సేపు వెతికాక వారిద్దరికీ స్తంభానికి అంతం ఎక్కడుందో కనిపించలేదు.
ఇద్దరూ వెనక్కి వచ్చారు. ఆ తర్వాత శివుడు తన అసలు రూపంలో వారిద్దరికీ కనిపించాడు. దీంతో బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ శివుడే గొప్పవారని నిర్ధారణకు వస్తారు. ఇంతకుమించిన శక్తి ఎవరి దగ్గర లేదు. ఈ స్తంభం కథ శివుని జన్మ గురించి కానీ శివుని అంతం గురించి కానీ తెలియజేయలేదు. అందుకే శివుడిని స్వయంభువుడు అంటారు. శివుడికి అంతమే లేదని అంటారు.
మరో పురాణ కథ ప్రకారం బ్రహ్మ దేవుడు శివుడికి తండ్రి అనే నమ్మేవారు చాలా మంది ఉన్నారు. శివుడు బ్రహ్మ దేవుడి పుత్రుడిగా ఎలా మారాడో బ్రహ్మ పురాణంలో ఉంది. బ్రహ్మ దేవుడు సృష్టి కర్త.. అలా సృష్టిని రచించేటప్పుడు... బ్రహ్మకు ఒక పిల్లవాడు అవసరమయ్యాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రార్థించగానే ....శివుడు అతని ఒడిలో చిన్న పిల్లాడిలా ప్రత్యక్షం అవుతాడు. బ్రహ్మ దేవుడు ఆ చిన్నారి శివుడి ఏడుపు వినగానే ఎందుకు ఏడుస్తున్నావ్ అని అడిగాడు. అప్పుడు ఆ చిన్నారి తనకు ఏ పేరూ లేదని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ అతనికి రుద్ర అని పేరు పెడతాడు. రుద్ర అంటే ఏడ్చేవాడు అని అర్థం. ఆ తర్వాత కూడా శివుడు ఏడుపు మానలేదు. దీంతో బ్రహ్మ వేరే పేరు పెడతాడు. అప్పుడు కూడా శివుడు ఏడుపు ఆపడు. శివుడు ఏడుపు ఆపేందుకు అతనికి 108 పేర్లు పెడతాడు. అలా బ్రహ్మదేవుడు శివుడికి పెట్టిన 108 పేర్లను భూమిపై రాసిపెట్టినట్లు శివ పురాణం చెప్తోంది.
శివపురాణం ప్రకారం శివుడిని స్వయంభువుడు అంటారు. అంటే అతని పుట్టుక స్వయంగా జరిగింది. తల్లీతండ్రి లేరు. శివయ్యకు మరణం కూడా లేదు. విష్ణు పురాణంలో శివుని పుట్టుక గురించి చెప్పుకుందాం. విష్ణువు నుదుటి నుంచి వెలువడే కిరణాల నుంచి శివుడి పుట్టుక జరిగింది.
భూమి, ఆకాశం, పాతాళం నీటిలో మునిగిపోయినప్పుడు విష్ణువు మినహా మరో ప్రాణి ఈ లోకంలో జీవించి లేదు. అప్పుడు విష్ణువు ఒక్కడే తన శేషతల్పంపై తేలుతూ ఉన్నాడు. ఆ తర్వాత అతని నాభి నుంచి బ్రహ్మ జన్మించాడు. విష్ణువు, బ్రహ్మ విశ్వం గురించి మాట్లాడుకుంటున్న సమయంలో శివుడి ప్రస్తావన వచ్చింది. బ్రహ్మ దేవుడు అతన్ని గుర్తించడానికి నిరాకరించాడు. దీంతో శివుడు అలిగాడు. విష్ణువు ...శివుడికి దివ్యదృష్టి ప్రసాదించి బ్రహ్మ దేవుడికి శివుడి గురించి గుర్తుచేసాడు. ఆ తర్వాత బ్రహ్మ తన తప్పు తెలుసుకుని క్షమాపణలు కోరాడు. తన తప్పును సరిచేసుకోవడానికి తన కుమారుడి రూపంలో పుట్టాలని ఆశీర్వదిస్తాడు. దీంతో శివుడు బ్రహ్మ కోరిక మేరకు ఆయన కడుపున పుడతానని మాటిస్తాడు.