చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎప్పుడైనా, ఎక్కడైనా.. ఏ వాతావరణంలోనైనా తినే పండ్లు ఏమైనా ఉన్నాయా అంటే వెంటనే డేట్స్ (ఖర్జూర) అని చెప్పవచ్చు. డేట్స్ లో ఉండే న్యూట్రిషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఫ్రెష్ ఫ్రూట్స్ తో పోల్చితే డేట్స్ లో ఎక్కువ కేలరీలు ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. ఫిగ్ (అత్తిపండు), ఎండుద్రాక్ష మొదలైన డ్రై ఫ్రూట్స్ తో పోల్చితే డేట్స్ లో ఉండే కేలరీస్ ఎక్కువ. ఎక్కువ మొత్తంలో ఫైబర్, మినరల్స్, విటమిన్స్ తో ఎల్లవేళలా తినగలిగే పండ్లుగా డేట్స్ ను పిలుస్తుంటారు. డేట్స్ ఇచ్చే లాభాలు పొందాలంటే కచ్చితంగా రోజుకు రెండు ఖర్జూరాలు తినాలంటున్నారు న్యూట్రిషనిస్టులు.
డేట్స్ వలన కలిగే ఆరు లాభాలు:
1. పేగు కదలికలు పెంచి మలబద్ధకాన్ని తగ్గిస్తుంది
ఈ పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ పేగు కదలికలకు తోడ్పడుతుందట. ఫలితంగా మలబద్ధకం సమస్యను దూరం చేస్తుంది. నీళ్లలో కరిగే ఫైబర్ పేగుల్లోని వేస్టేజ్ గట్టిపడకుండా సహకరిస్తుంది. అదేవిధంగా కరగని ఫైబర్ పేగు కదలికలకు ఉపయోగపడుతుంది. దీంతో మలబద్ధకం తగ్గుతుంది.
2. రోగ నిరోధక శక్తి పెంచే యాంటి ఆక్సిడెంట్స్
రోజుకు రెండు డేట్స్ తినటం వలన బాడీలో యాంటి ఆక్సిడెంట్స్ పెరుగుతాయి. కణాలను యాంటి ఆక్సిడెంట్స్ అంటిపెట్టుకొని ఫ్రీ రాడికల్స్ పై పోరాడుతాయి. ఫ్రీ రాడికల్స్ స్థిరమైన కెమికల్స్.. వీటి వలన తరచుగా జ్వరం లాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. డేట్స్ యాంటి ఆక్సిడెంట్స్ ను తగ్గించడంలో తోడ్పడతాయి. ఫ్లెవనాయిడ్స్ అనే యాంటి ఆక్సిడెంట్స్ డయాబెటిక్స్ (షుగర్) రాకుండా ఉపయోగపడతాయి. అల్జీమర్స్ (మతిమరుపు) ను తగ్గించడంలో కూడా కీలకంగా పనిచేస్తుంది. అదే విధంగా కొన్ని రకాల క్యాన్సర్ కణాలను నిర్మూలించడంలో ఈ ఫ్లెవనాయిడ్స్ తోడ్పడతాయి.
3. దీర్ఘ కాలిక రోగాలను తగ్గించడం:
యాంటి ఆక్సిడెంట్స్ కంపౌండ్స్ డేట్స్ లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఫ్లెవనాయిడ్స్ ను డెవలప్ చేసి.. సెల్స్ (కణాలు) కు రక్షణ కవచంగా ఉంటాయి. యాంటి ఆక్సిడెంట్స్ బాడీలో తగ్గిపోతే.. ఆరోగ్యవంతమైన కణాల నుండి ఎలక్ట్రాన్స్ ను తీసుకుంటాయి. దీంతో కణాలా డ్యామేజ్ అవుతాయి. దీంతో దీర్ఘకాలిక రోగాలు వచ్చే అవకాశం ఉంది. డేట్స్ తినడం వలన లాంగ్ టర్మ్ ఇల్ నెస్ తగ్గిపోతుంది.
4. డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుంది:
డేట్స్ లో కార్బోహైడ్రేట్స పుష్కలంగా ఉండటంతో టైప్ 2 డయాబెటిస్ ను కంట్రోల్ చేస్తుందట. 2020లో 100 మందిపై చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. 16 రోజులు వరుసగా రోజుకు 3 కర్జూరాలు తినడం వలన డయాబెటిస్ కంట్రోల్ అయ్యిందట. అంతే కాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గి గుడ్ కొలెస్ట్రాల్ (HDL) పెరిగిందట. డేట్స్ లో గ్లైసెమిక్ లేకపోవడం వలన బ్లడ్ షుగర్ పై ఎలాం టి ప్రభావం ఉండదట. అందుకే.. షుగర్ ఉన్నవాళ్లు.. డైట్ లో కర్జూరాను యాడ్ చేసుకోవడం మంచిది.
5. ఎముకలు గట్టి పడటంలో తోడ్పడుతుంది:
డేట్స్ లో ఎక్కువ మొత్తంలో మినరల్స్ ఉండటంతో బోన్స్ గట్టి పడటంలో చాలా తోడ్పడతాయి. అదే విధంగా ఎముకల్లో చీలికలు.. నొప్పి తదితర సమస్యలపై (ఆస్టియోపోరోసిస్) పోరాడుతుంది. డేట్స్ లో కాపర్, మ్యాంగనీస్, సెలెనియం మొదలైన మినరల్స్ ఉంటాయి. ఇవి మంచి ఎముకలు ఏర్పడటానికి ఉపయోగపడతాయి. రోజుకు రెండు డేట్స్ తింటే.. మీ ఎముకలు గట్టిపడతాయి.
6. డేట్స్ తినటం వలన యవ్వనంగా (యంగ్) కనిపిస్తారు:
మనుషుల్లో హార్మోల్లు ఏ విధంగా ఉపయోగపడతాయో.. అదే విధంగా ఫైటో హార్మోన్స్ (ప్లాంట్ హార్మోన్స్) మొక్కల్లో రీప్రొడక్షన్ (ప్రత్యుత్పత్తి), గ్రోత్ (పెరుగుదల) కు తోడ్పడతాయి. డేట్స్ లో ఫైటో హార్మోన్స్ ఉండటం వలన స్కిన్ (చర్మం) గ్లో వచ్చేలా చేసి మరింత యంగ్ లుక్ లో కనిపించేలా తోడ్పతాయి. స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ల్లో కూడా ఈ ఫైటో హార్మోన్స్ వాడతారు. ఖర్జూర చెట్టు నుంచి తీసిన రసం స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో వాడుతున్నారంటే అవి చేసే మేలు ఎంతో ఆలోచించవచ్చు. ఆ ప్రాడక్ట్స్ ను వయసు మళ్లిన ఆవిడ కంటి భాగంగాలో రోజుకు రెండు సార్లు అప్లై చేయగా.. స్కిన్ ముడతలు తగ్గి.. యంగ్ లుక్ కనిపించిందట.
చూశారా.. డేట్స్ వాడటం వలన ఎంత మేలు కలుగుతుందో. అందుకే .. డైలీ డేట్స్ మీ డైట్ లో ఉండేలా చూసుకోండి.