ఆరు దేశాల్లోని ఇండియన్లకు యూఏఈ వీసా అన్ అరైవల్

ఆరు దేశాల్లోని ఇండియన్లకు యూఏఈ  వీసా అన్ అరైవల్

న్యూఢిల్లీ: యునైటెడ్‌‌‌‌ అరబ్‌‌‌‌ ఎమిరేట్స్‌‌‌‌(యూఏఈ) కు వెళ్లే భారతీయులకు ‘వీసా-ఆన్‌‌‌‌- అరైవల్‌‌‌‌’ సదుపాయాన్ని ఆ దేశం విస్తరించింది. ఆరు దేశాల్లో చట్టబద్ధంగా ఉంటున్న ఇండియన్లు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చని తెలిపింది. సింగపూర్, జపాన్, దక్షిణకొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా దేశాలకు చెందిన గ్రీన్ కార్డు లేదా రెసిడెన్స్ పర్మిట్ ఉన్నవారు యూఏఈలో ఎంట్రీ కాగానే ‘వీసా ఆన్ అరైవల్’ ను ఉపయోగించుకోవచ్చని చెప్పింది. 

యూఏఈ ఇప్పటికే అమెరికా గ్రీన్‌‌‌‌ కార్డు లేదా చెల్లుబాటయ్యే వీసా, యూరోపియన్ యూనియన్, యూకే దేశాలు ఇచ్చిన రెసిడెన్స్‌‌‌‌ పర్మిట్, వీసాలు కలిగి ఉన్న ఇండియన్లకు ‘వీసా అన్ అరైవల్’ సదుపాయాన్ని కల్పిస్తోంది. ఇందుకోసం పాస్‌‌‌‌పోర్టు కనీసం 6  నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. ప్రయాణికులు 4 రోజుల పాటు ఈ వీసాను వినియోగించుకునేందుకు రూ.2,270 చెల్లించాలి. దీనిని 14 రోజుల పాటు పొడిగించేందుకు రూ.5,670 కట్టాలని అధికారులు తెలిపారు.