
చేర్యాల, వెలుగు: మద్దూరు పీఎస్పరిధిలోని సలాక్పూర్ గ్రామ శివారులో పేకాట ఆడుతున్న ఆరుగురిని శనివారం పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.70,000 నగదు, 6 ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. సలాక్పూర్ గ్రామానికి చెందిన కాసు ఇన్నారెడ్డి, విరుపాక మహేందర్‌రెడ్డి, ఇన్న దినేశ్, ఇరువ రంజిత్‌రెడ్డి, మామిడి గోపీకృష్ణ, దేవీ భూపాల్ ను పీఎస్తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.