ఆటో బోల్తా పడి ఆరుగురు బాలికలకు గాయలు

  •     జిన్నారంలో ఆరుగురు బాలికలకు గాయాలు

జన్నారం, వెలుగు :  నిర్మల్​జిల్లా జిన్నారం మండల కేంద్రంలో ఆటో బోల్తా పడి ఆరుగురు బాలికలు స్వల్పంగా గాయపడ్డారు. రోటిగూడ గ్రామానికి చెందిన ఆరుగురు బాలికలు మండల కేంద్రంలోని గర్ల్స్​హైస్కూల్​చదువుకుంటున్నారు. రోజూలాగే గురువారం స్కూలుకు వెళ్లిన వారు, సాయంత్రం తిరిగి ఇంటికి వెళ్తూ ఆటో ఎక్కారు. 

జిన్నారం జింకల పార్కు సమీపంలో ఆటో వెనుక టైర్​పేలింది. దీంతో ఒక్కసారిగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. డ్రైవర్ నగేశ్ తో పాటు ఆరుగురు బాలికలకు స్వల్ప గాయాలయ్యాయి. అటుగా వెళ్తున్న వాహనదారులు బాధితులను బయటకు తీసి 108కు సమాచారం అందించారు. 108 సిబ్బంది ఫస్ట్​ఎయిడ్​చేసి, మండల కేంద్రంలోని హాస్పిటల్ కు తరలించారు.