రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి

సత్తుపల్లి, వెలుగు :  కాంట్రిబ్యూషన్ పెన్షన్ తో కుటుంబాలు గడవని రిటైర్డ్ ఆర్టీసీ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని కోరుతూ ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో నాయకులు సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయిని కోరారు. 

ఆదివారం ఎమ్మెల్యే నివాసంలో ఆమెను కలిసి తమ సమస్యలను వివరించారు. 30 ఏళ్లు సర్వీస్ పూర్తి చేసిన కూడా కనీసం ఇళ్లు లేని ఆర్టీసీ కార్మికులు ఉన్నారని తెలిపారు. పెన్షన్ కుటుంబ పోషణ కూడా సరిపోక ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎల్ఎస్ రెడ్డి, కార్యదర్శి ఆర్.వి కుమార్, దాస్, రాష్ట్ర కమిటీ సభ్యులు గడ్డం శ్రీనివాసరావు పాల్గొన్నారు.