ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

 ఆరుగురు గంజాయి విక్రేతల అరెస్ట్

సిద్దిపేట రూరల్, వెలుగు: గంజాయి అమ్ముతున్న ఆరుగురు వ్యక్తులను అరెస్ట్ ​చేసినట్లు సీఐ శ్రీను తెలిపారు. శనివారం సిద్దిపేటలోని రూరల్ సర్కిల్ ఆఫీస్ లో వివరాలు వెల్లడించారు. నంగునూర్ మండలం అప్పలాయ చెరువుకు చెందిన నాయిని రాజశేఖర్ రెడ్డి, రాంరెడ్డి, జేపీ తాండాకు చెందిన గూగులోతు ప్రవీణ్, బద్దిపడగ గ్రామానికి చెందిన అలకుంట రాకేశ్, గుగులోత్ రాజ్ కుమార్, అర్బన్ మండలం రంగధాంపల్లి కి చెందిన రొంపల్లి నరేశ్ శనివారం మధ్యాహ్నం రాంపూర్ ఎక్స్ రోడ్ బస్టాండ్ వెనక గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం వచ్చిందన్నారు.

రాజగోపాలపేట ఎస్ఐ ఆసిఫ్,  సిబ్బందితో వెళ్లి పట్టుకుని వారి దగ్గరి నుంచి 508 గ్రాముల గంజాయి, 2 బైక్ లు, 5 సెల్ ఫోన్లు, రూ. 3600 నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్ తరలించినట్లు చెప్పారు.