గెలిచిన వాళ్లలో మన మహిళలు ఆరుగురు
డజన్‌కు పైగా మనవాళ్లు విజయం
కాంగ్రెస్‌కు రెండోసారి ఎన్నికైన నలుగురు
వాషింగ్టన్: అమెరికా ఎన్నికల్లో ఈసారి మనోళ్లు చాలామంది గెలిచారు. ‘సమోసా కాకస్’గా పేరు పొందిన నలుగురు ఇండియన్ అమెరికన్స్ ప్రమీలా జయపాల్, రోఖన్నా, డాక్టర్ అమీ బెరా, జెన్నిఫర్, రాజా కృష్ణ మూర్తి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌గా తిరిగి ఎన్నికవ్వగా.. స్టేట్ అసెంబ్లీల్లో ఐదుగురు ఆడవాళ్లు గెలిచారు. కొంతమంది మొదటిసారి గెలిచి చరిత్ర సృష్టించారు. మరికొంత మంది రీ ఎలెక్ట్ అయ్యారు. జెన్నీఫర్ రాజ్‌కుమార్ న్యూయార్క్ రాష్ట్ర అసెంబ్లీకి, కెంటకి స్టేట్ హౌస్‌కి నిమాకులకర్ణి, వాషింగ్టన్ స్టేట్ హౌస్‌కి వందనా స్లాటర్, మిషిగన్ స్టేట్ హౌస్‌కి పద్మా కుప్పా ఎన్నికయ్యారు. వెర్మాంట్ స్టేట్ సెనేటర్‌గా కేశారామ్, ఓహియో స్టేట్ సెనేట్‌గా నీరజ్ అంతాని గెలుపొందగా.. నార్త్ కరోలినా స్టేట్ సెనేట్‌గా జై చౌధురి తిరిగి ఎన్నికయ్యారు. అరిజోనా స్టేట్ సెనేటర్ గా అమిశ్ షా, పెన్సిల్వేనియా స్టేట్ హౌస్‌కి నిఖిల్ సావల్, మిషిగన్ స్టేట్ హౌస్‌కి రంజీవ్ పూరీ, న్యూయార్క్ స్టేట్ సెనేటర్ గా జర్మీ కూనీ గెలిచారు. కాలిఫోర్నియా స్టేట్ అసెంబ్లీకి యాష్ కాల్రా వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. టెక్సాస్ డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జి పోల్స్‌లో రవీ శ్యాండిల్ గెలుపొందారు. మరికొన్ని చోట్ల ఇంకా ఫలితాలు తేలాల్సి ఉండగా.. అక్కడ కూడా ఇండియన్ అమెరికన్స్ లీడ్‌లో ఉన్నారు. మన వాళ్లు ఆరుగురు ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో ఇండియన్ అమెరికన్ల పాత్ర చాలా ఎక్కువగా ఉందని ఇంపాక్ట్ ఫండ్స్‌కు చెందిన నీల్ మఖిజా అన్నారు. దాదాపు 20 క్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని సెంటర్ ఫర్ అమెరికన్ ప్రోగ్సెస్ చెప్పింది.
మిలియనీర్, సైంటిస్ట్ శ్రీ థానెదర్ గెలుపు..
రెండేండ్ల కింద గవర్నర్ గా పోటీ చేసి మూడో స్థానంతో సరిపెట్టుకున్న ఇండో అమెరికన్ మిలియనీర్, సైంటిస్ట్ శ్రీ థానెదర్ ఈసారి మిషిగన్ థర్డ్ డిస్ట్రిక్ట్ నుంచి ప్రతినిధుల సభ సభ్యుడిగా విజయం సాధించారు. సొంత డబ్బుతో పాటు విరాళాలతో కలిపి 4.38 లక్షల డాలర్ల ఫండ్స్ సేకరించిన ఆయన ఈ ఎన్నికల్లో ఏకంగా 93 శాతం ఓట్లను దక్కించుకుని.. ఆరుగురు ప్రత్యర్థులను మట్టికరిపించారు. కర్నాటకలోని బెళగాంకు చెందిన శ్రీ 1979లో యూఎస్ వెళ్లి అక్కడే సెటిల్ అయ్యారు.
For More News..