
దుబాయ్: టీ20 వరల్డ్ కప్ నేపథ్యంలో.. ఐసీసీ ఎంపిక చేసిన ‘టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్’లో విరాట్ కోహ్లీకి చోటు దక్కలేదు. టీమిండియా నుంచి రోహిత్, సూర్య, హార్దిక్, అక్షర్, బుమ్రా, అర్ష్‌దీప్‌కు ప్లేస్ లభించింది. లీగ్ దశలో ఫెయిలైన విరాట్.. ఫైనల్లో మాత్రం సత్తా చూపెట్టాడు. మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్‌తో ఏకంగా కప్ తెచ్చిపెట్టాడు. అయినా ఐసీసీ టీమ్‌లో చోటు దక్కించుకోలేకపోయాడు. అఫ్గాన్ నుంచి రహమానుల్లా గుర్బాజ్, రషీద్ ఖాన్, ఫారూఖీ ఉండగా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్ నుంచి స్టోయినిస్, పూరన్‌కు అవకాశం వచ్చింది. 12వ ప్లేయర్‌గా అన్రిచ్ నోర్జ్‌కు చాన్స్ దక్కింది.