దైవదర్శనానికి వెళ్లి వస్తుండగా.. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. టూరిస్టులతో వెళ్తున్న మినీ బస్సు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు స్పాట్ లోనే చనిపోయారు. మరో 16 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. చికిత్సకోసం గాయపడ్డవారిని సమీప ఆస్పత్రులకు తరలించారు. 

బుధవారం(సెప్టెంబర్ 25, 2024)  తెల్లవారుజామున ఉలుండర్ పేట్ పరిధిలోని మెట్టాపూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. భారీ వర్షం కారణంగా డ్రైవర్ బస్సుపై కంట్రోల్ తప్పడంమే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. 

ప్రమాదంలో గాయపడిన వారి అరుపులు విన్న స్థానికులు ప్రమాద స్థలానికి చేరుకుని వారిని ఆస్పత్రికి తరలించారు.. పోలీసులకు సమాచారం ఇచ్చారు. తిరు చందూర్ మురుగన్ ఆలయానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు, గాయపడ్డవారంతా రాణిపేటకు చెందినవారిగా పోలీసులు గుర్తించారు.