మహబూబ్‌నగర్, వెలుగు : బీజేపీ మూడో లిస్టులో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో ఆరుగురిని ఫైనల్ చేసింది. మరో ఐదు స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ప్రకటించకుండా పెండింగ్‌లో పెట్టింది. ఇటీవల బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన మాజీ మంత్రి చిత్తరంజన్‌దాస్‌కు జడ్చర్ల టికెట్ కేటాయించగా, నారాయణపేట నుంచి రతంగ్ పాండురెడ్డి, మక్తల్ నుంచి జలంధర్‌రెడ్డి, వనపర్తి నుంచి అశ్వత్థామరెడ్డి
అచ్చంపేట నుంచి సతీశ్, షాద్‌నగర్ నుంచి అందె బాబయ్య పేర్లను కన్ఫాం చేశారు. గద్వాల, కొడంగల్, దేవరకద్ర, అలంపూర్, నాగర్‌కర్నూల్ సెగ్మెంట్లకు క్యాండిడేట్లను ప్రకటించాల్సి ఉంది. పెండింగ్‌లో ఉన్న కొడంగల్, అలంపూర్, నాగర్‌కర్నూల్ సెగ్మెంట్లలో ఒక స్థానాన్ని పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాల ద్వారా తెలిసింది.
ALSO READ : ప్రజలు మార్పు కోరుకుంటున్నారు : వీరేశం