- భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం
భద్రాచలం, వెలుగు : సుక్మా జిల్లా టేకులగూడ-సిలిగిరి అటవీ ప్రాంతంలో ఈనెల 23వ తేదీన సీఆర్పీఎఫ్జవాన్ల ట్రక్కును పేల్చిన ఘటనలో బుధవారం ఆరుగురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. ఎస్పీ కిరణ్చౌహాన్ కథనం ప్రకారం...జవాన్ల ట్రక్కు పేల్చిన ఘటనలో ఇద్దరు జవాన్లు విష్ణు ఆర్, శైలేంద్ర చనిపోయారని
తాము అరెస్ట్ చేసిన మావోయిస్టులు ఆ ఘటనలో పాల్గొన్నట్లుగా విచారణలో తేలిందన్నారు. ఘటన జరిగిన వెంటనే సమీప అడవుల్లో కూంబింగ్ చేయగా వీరు పట్టుబడ్డారన్నారు. వారి వద్ద భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.