భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

భారీ ఎన్ కౌంటర్.. ఆరుగురు మావోయిస్టులు మృతి

తెలంగాణ-ఛత్తీస్ గఢ్ అటవీప్రాంతంలో మరో భారీ ఎన్ కౌంటర్ జరిగింది.. కిష్టారం పోలీస్ స్టేషన్ పరిధిలోని చెన్నచెంద అటవీప్రాంతంలో తెలంగాణ గ్రేహౌండ్స్, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. చర్లకు మండలానికి 25 కిలో మీటర్ల దూరంలోని కుర్ణవల్లి, పెసలపాడు అటవీ ప్రాంతంలో ఈ ఉదయం 6 నుంచి ఏడున్నర గంటల మధ్య కాల్పులు జరిగాయి. కాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు చనిపోయినట్లు భద్రాద్రి కొత్తగూడెం సునీల్ దత్ తెలిపారు. చనిపోయిన ఆరుగురిలో... నలుగురు మహిళా మావోయిస్టులు ఉన్నట్లు తెలుస్తోంది. రాత్రి నుంచి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో తెలంగాణ, ఛత్తీస్ గఢ్ గ్రేహౌండ్స్ సెర్చ్ ఆపరేషన్ మొదలు పెట్టాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి:

జగిత్యాలలో 15 మంది బీజేపీ నేతల అరెస్ట్

తలనొప్పి తగ్గట్లేదని సూసైడ్