చాంపియన్స్ ట్రోఫీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నీ’లో ఆరుగురు మనోళ్లే

చాంపియన్స్ ట్రోఫీ ‘టీమ్ ఆఫ్ ది టోర్నీ’లో ఆరుగురు మనోళ్లే

దుబాయ్: స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సహా ఆరుగురు ఇండియా క్రికెటర్లు  ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'కు ఎంపికయ్యారు. మెగా టోర్నీలో సత్తా చాటిన  12 మంది ప్లేయర్లతో ఐసీసీ సోమవారం ఈ టీమ్‌‌‌‌ను ప్రకటించింది. ఇందులో సగం మంది ట్రోఫీ నెగ్గిన ఇండియా ప్లేయర్లే ఉన్నారు. టోర్నీలో  సెంచరీ, ఫిఫ్టీ సహా 218 రన్స్ చేసిన కోహ్లీతో పాటు- ఇండియా టాప్ స్కోరర్ శ్రేయస్ అయ్యర్ (243), - కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, 140 రన్స్‌‌‌‌),- వరుణ్ చక్రవర్తి (9 వికెట్లు), మహ్మద్ షమీ (9 వికెట్లు) ఎంపికవగా.. అక్షర్ పటేల్ 12వ ప్లేయర్‌‌‌‌గా నిలిచాడు. 

టీమిండియా కెప్టెన్ రోహిత్‌‌‌‌కు చోటు లేకపోవడం గమనార్హం. రన్నరప్‌‌‌‌గా నిలిచిన న్యూజిలాండ్ నుంచి నలుగురు ప్లేయర్లు ఎంపికయ్యారు. ఆ టీమ్ నాయకుడు  మిచెల్ శాంట్నర్ కెప్టెన్‌‌‌‌గా సెలెక్ట్ అయ్యాడు. టోర్నీలో టాప్ స్కోరర్‌‌‌‌‌‌‌‌ రచిన్ రవీంద్ర (263) మ్యాట్ హెన్రీ, గ్లెన్ ఫిలిప్స్‌‌‌‌కు చాన్స్‌ లభించింది. అఫ్గానిస్తాన్‌‌‌‌ ప్లేయర్లు అజ్మతుల్లా ఒమర్‌‌‌‌‌‌‌‌జాయ్‌‌‌‌, ఇబ్రహీం జర్దాన్‌‌‌‌ కూడా ఎంపికయ్యారు.