- చత్తీస్గఢ్లోని బీజాపూర్జిల్లాలో ఘటన
భద్రాచలం, వెలుగు: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌటర్లో ఓ పసిపాప కన్నుమూసింది. సోమవారం భైరంగఢ్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఆరు నెలల పసిపాపకు బుల్లెట్తగలడంతో పాటు ఆమె తల్లి కూడా గాయపడింది.
తల్లిని దగ్గర్లోని దవాఖానకు తరలించారు. కాల్పుల్లో భైరంగఢ్ ఏరియా కమిటీ సభ్యుడు చంద్రన్నతో పాటు మరికొందరు మావోయిస్టులకు గాయాలయ్యాయని భైరంగఢ్ ఏఎస్పీ తెలిపారు. పారిపోయిన మావోయిస్టుల కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. ఇద్దరు డీఆర్జీ జవాన్లు కూడా గాయపడగా చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు