6 నెలల గర్భిణికి సిజేరియన్

6 నెలల గర్భిణికి సిజేరియన్
  •     కిలోన్నర బాబుకు జన్మ
  •     నీలోఫర్ ఆస్పత్రిలో అరుదైన ఆపరేషన్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: సిటీలోని నీలోఫర్ ఆస్పత్రి డాక్టర్లు అరుదైన ఆపరేషన్​ను సక్సెస్​చేశారు. ఆరున్నర నెలల గర్భిణికి సిజేరియన్​ద్వారా డెలివరీ చేసి మగబిడ్డకు జన్మనిచ్చేలా చేశారు. వికారాబాద్ జిల్లా కవిత(35) ఆరున్నర నెలల(27 వారాలు) గర్భిణి. ఈ నెల 1న తీవ్ర రక్తస్రావం కావడంతో మొదట ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు తీసుకెళ్లి అక్కడి నుంచి నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 

టెస్టులు చేసిన డాక్టర్లు ఇన్ బ్రాకెట్స్ జి ఫోర్, ప్లాసెంటా పర్క్రిటా విత్ బ్లాడర్ ఇన్వెన్షన్ అనే అరుదైన సమస్యతో కవిత ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. సోమవారం ఎలక్షన్ ఎలెక్టివ్ హిస్టరీ సిజేరియన్, హిస్టరీ విత్ బ్లాడర్ రిపేర్ చేశారు.  కవిత కిలోన్నర బరువున్న మగ బిడ్డకు జన్మనిచ్చింది. సిజేరియన్​టైంలో 30 ప్యాకెట్ల రక్తం ఎక్కించినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ ఎన్.రవికుమార్ తెలిపారు. బాబును ఎన్ఐసీయూలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. కవిత ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.