కోడి పందాలకు వెళ్తున్న ఆరుగురి అరెస్ట్

బూర్గంపహాడ్, వెలుగు: ఆంధ్ర, ఛత్తీస్ గఢ్​బోర్డర్ లోని మారాయి గూడెంలో పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న కోడిపందాలకు వెళ్తున్న వ్యక్తులను బూర్గంపహాడ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. సారపాకలో వాహనాలు తనిఖీ చేస్తన్న క్రమంలో ములకలపల్లి నుంచి వస్తున్న వాహనాన్ని తనిఖీ చేశారు.

దానిలో పందెపు కోళ్లను గుర్తించిన పోలీసులు వారిని విచారించగా మారాయిగూడెంలో కోడి పందాలకు వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో వాహనంతో పాటు ములకలపల్లికి చెందిన ఆరుగురిని, 5 కోళ్లు, రూ.2లక్షల 84వేలు నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఎస్సై సంతోష్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.