పరిగి-హైదరాబాద్ హైవేపై వెహికల్స్​ఢీ కొని ఆరుగురికి గాయాలు

పరిగి-హైదరాబాద్ హైవేపై వెహికల్స్​ఢీ కొని ఆరుగురికి గాయాలు

–పరిగి వెలుగు :   పరిగి మున్సిపల్ శివారులో  హైవే పై జరిగిన రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్​కు చెందిన విద్యార్థులకు,  బొబ్బిలిగామకు చెందిన కుటుంబీకులకు గాయాలయ్యాయి. పరిగి నుంచి కోడంగల్  వెళ్తున్న   క్రెటా కార్   దాని ముందు వెళ్తున్న  సిమెంట్ ట్యాంకర్ ను ఓవర్ టాక్  చేస్తూ.. ఎదురుగా వచ్చిన బెలోనో  కారు ను  ఢీ కొట్టింది.   

బెలోనో  లో ఉన్న      ప్రభుత్వ కాలేజీ హాస్టల్ విద్యార్థులు ఆనంద్, రాజేశ్​, ఎన్టీఆర్ కు గాయాలయ్యాయి.  క్రేటకారులో  బొబ్బిలిగామకు చెందిన కే మంజుల, ఎర్రవల్లి గ్రామానికి చెందిన పి అనిత కు స్వల్ప గాయాలయ్యాయి.