- నాందేడ్ కు చెందిన ఆరుగురికి తీవ్రగాయాలు
- బాధితులంతా ఒకే కుటుంబానికి చెందినవారు
- ఆదిలాబాద్ జిల్లా రోల్ మామడ వద్ద ఘటన
నేరడిగొండ, వెలుగు: కారు టైర్ పేలిపోయి అదుపుతప్పి బ్రిడ్జిపై నుంచి కిందపడటంతో ఆరుగురు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదిలాబాద్జిల్లాలో జరిగింది. బాధితులు, స్థానికులు తెలిపిన మేరకు.. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి ఓ కుటుంబం కుంటాల జలపాతం చూసేందుకు ఆదివారం కారులో వస్తోంది.
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రోల్ మామడ వద్దకు రాగానే నేషనల్ హైవే పై అకస్మాత్తుగా కారు టైరు పేలిపోయి బ్రిడ్జి పైనుంచి కిందికి పడిపోయింది. దీంతో కారులోని ఆరుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెళ్లి బాధితులను నిర్మల్ హాస్పిటల్ కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీకాంత్ తెలిపారు .