ప్రజాస్వామ్యంలో మీడియా మూలస్తంభం : ఉత్తమ్ ​కుమార్​రెడ్డి

  • ఈ రంగానికి అన్నిరకాల సహకారం అందిస్తం
  • హైబిజ్​టీవీ నాలుగో ఎడిషన్​ మీడియా అవార్డుల ప్రదానం

మాదాపూర్​, వెలుగు: అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్​లో మీడియా మూల స్తంభంగా ఉందని,  ప్ర జలకు, ప్రభుత్వానికి వారధిలా పనిచేస్తూ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నదని  మంత్రి ఉత్తమ్ ​కుమార్​రెడ్డి తెలిపారు. మీడియా రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా సహకారం అందిస్తుందని స్పష్టం చేశారు. గురువారం హైదరాబాద్​లోని మాదాపూర్​హెచ్ఐసీసీ వేదికగా హైబిజ్​టీవీ నిర్వహించిన నాలుగో ఎడిషన్​ మీడియా అవార్డుల కార్యక్రమానికి మంత్రి ఉత్తమ్​ కుమార్​రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ కేటగిరీల్లో ప్రతిభ కనబర్చిన 69 మంది మీడియా ప్రతినిధులకు అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్​కుమార్​రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధిలో మీడియా పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. 

వీ6, వెలుగుకు ఆరు అవార్డులు

వీ6, వెలుగు మీడియాలో పనిచేస్తున్న ఆరుగురికి హైబిజ్​అవార్డులు దక్కాయి. వెలుగు దినపత్రిక నుంచి విజనరీ అవార్డును అడ్వర్టైజ్మెంట్​ జీఎం సంతోష్​, బెస్ట్​ కార్టూనిస్ట్​ అవార్డును వెంకటేశ్, సీనియర్​ మోస్ట్​ ఎంప్లాయ్​అవార్డును ఎంఆర్కే గణపతిరావు, న్యూ క్లయింట్​ఎక్విజిషన్​ అవార్డును ప్రేమ్​కుమార్​రెడ్డి అందుకున్నారు. వీరితోపాటు వీ6 న్యూస్​ చానెల్ నుంచి బెస్ట్​ క్రైమ్​ రిపోర్టర్​గా సదానంద్​గౌడ్​, బెస్ట్​ స్పోర్ట్స్​ రిపోర్టర్​గా నరేందర్​రెడ్డి అవార్డులను పొందారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషనర్​ చైర్మన్​ కృష్ణమోహన్, క్రెడాయ్​ ప్రెసిడెంట్​ రాజశేఖర్​రెడ్డి, హైబిజ్​ టీవీ ఎండీ రాజగోపాల్, సీఈవో సంధ్యారాణి, మీడియా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.