
క్రోధి నామ సంవత్సరం (2025) పాల్గుణ మాసంలోని అమావాస్య ( మార్చి 29) చాలా ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఆ రోజున చాలా అరుదైన యాదృచ్చిక సంఘటనలు జరగబోతున్నాయి. ఆ రోజున మొదటి సూర్యగ్రహణం ఏర్పడనుంది. అంతేకాదు ఆరోజు ఆరుగ్రహాల కలయిక వలన షష్ఠ గ్రహకూటమి ఏర్పడనుంది. దీని వలన ప్రపంచ వ్యాప్తంగా చాలా మార్పులు సంభవిస్తాయని జ్యోతిష్య పండితులుచెబుతున్నారు. ఎలాంటి మార్పులు జరుగుతాయి.. షష్టగ్రహకూటమిలో ఏఏ గ్రహాలు కలవనున్నాయి.. మొదలగు విషయాలు తెలుసుకుందాం. . .
2025 వసంవత్సరంలో చంద్రగ్రహణం తరువాత సరిగ్గా 15 రోజుల తరువాత అంటే ఈ నెల 29 వ తేది శనివారం షష్టగ్రహకూటమితో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ సూర్యగ్రహణం మీనరాశి..ఉత్తరాబాధ్ర నక్షత్రంలో ఏర్పడనుంది. సూర్యుడు, రాహువు, శుక్రుడు, బుధుడు చంద్రుడు,శని మీనరాశిలో కలవబోతున్నారు.
Also Read:-12 రాశుల వారి ఆదాయం.. ఖర్చుల లెక్కలు ఇవే..!
షష్టగ్రహకూటమి.. సూర్యగ్రహణం రోజున ఏర్పడటంతో ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువుగా సంభవిస్తామని పండితులు చెబుతున్నారు. భూకంపాలు, వరదలు, సునామీలు , విమాన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి. అయితే ప్రాణనష్టం తక్కువుగా ఉంటుందని పండితులు అంచనా వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రాజకీయ గందరగోళం... అస్థిరత ఏర్పడుతుంది. వివిధ దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం .. బాంబులు విసురుకోవడం.. ఫైరింగ్ లాంటి ఘటనలు జరిగే అవకాశాలున్నాయి. ఒకానొక సమయంలో ప్రపంచ యుద్దం వస్తుందా అన్న అనుమానాలు కూడా కలుగుతాయి. ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు, హింస, ధర్నాలు, సమ్మెలు, బ్యాంకు మోసాలు, అల్లర్లు పరిస్థితులు ఏర్పడుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
ఈ ఏడాది (2025) మొదటి సూర్యగ్రహణం మార్చి 29 శనివారం రోజున ఏర్పడుతుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.20 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.16 గంటలకు ముగుస్తుంది. ఈ సూర్యగ్రహణం ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో మాత్రమే కనిపిస్తుంది. నాసా ప్రకారం, ఈ రోజున ( మార్చి 29) చంద్రుడు సూర్యుని ముందుకు వచ్చి దాని కాంతిని పాక్షికంగా కప్పేస్తాడు. అయితే, చంద్రుని నీడ మధ్య భాగం భూమిని చేరుకోదు. ఈ సూర్యగ్రహణం సమయంలో భూమిలోని కొన్ని ప్రాంతాలు పగలు.. కొన్నిప్రాంతాలు చీకటితో కప్పబడి ఉంటాయి. సూర్యగ్రహణం కొన్ని దేశాల్లో సంపూర్ణంగా.. మరికొన్ని దేశాల్లో పాక్షికంగా కనపడుతుంది. కొన్ని చోట్ల అసలు కనపడదు.
మార్చి 29న కుంభ రాశిలో ఉన్న శని మీన రాశిలోకి ప్రవేశించడంతో షష్టగ్రహకూటమి ఏర్పడుతుంది. శని 100 సంవత్సరాల తర్వాత మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శని మీన రాశిలోకి ప్రవేశించడం వలన ధనుస్సు, మిథున, కర్కాటక రాశి వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. సింహం, కన్య, మీన రాశుల కొన్ని ఇబ్బందలుంటాయి. ఇక మిగతా రాశుల వారికి మిశ్రమ ఫలితాలుంటాయి. షష్టగ్రహకూటమి 12 రాశుల వారి జీవితాల్లో మార్పులను తెస్తుంది. శని జూన్ 3, 2027 వరకు మీన రాశిలో ఉంటాడని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.