జ్యోతిష్యం: మరికొన్ని గంటల్లో షష్టగ్రహకూటమి.. .. ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

జ్యోతిష్యం: మరికొన్ని గంటల్లో  షష్టగ్రహకూటమి.. .. ఏ రాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి...

గ్రహాలు.. స్థానాలు మారుతున్నా.. ఒక గ్రహం వేరే గ్రహంతో కలుస్తున్నా జ్యోతిష్య శాస్త్ర ప్రకారం అనేక మార్పులు జరుగుతాయని పండితులు చెబుతుంటారు.  పండితులు తెలిపిన వివరాల ప్రకారం 2025 మార్చి29న ఆరుగ్రహాలు రవి, బుధుడు, శుక్రుడు, చంద్రుడు, శని రాహువు మీన రాశిలో కలిసి షష్ట గ్రహకూటమి ఏర్పడటంతో 12  రాశుల వారికి శుభ , అశుభ , మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఈ ఫలితాల ప్రభావంఎలా ఉన్నపటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. జ్యోతిష్య  నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం   ఏ రాశి వారు ఎలాంటి పరిహారం చేయాలో తెలుసుకుందాం. . .

  జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. ఒకే కక్ష్యలోకి 6 రాశులు రాశులు రావడం అరిష్టం అని కొందరూ పేర్కొంటున్నారు. ఒకే గ్రహం పై 6 గ్రహాలు రావడం సైన్స్ అద్భుతమని దీని వల్ల ప్రపంచానికి మేలు జరుగుతుందని అంటున్నారు. గ్రహాలు వ్యక్తిగత జన్మనక్షత్రాన్ని బట్టి ఆయారాశులపై ప్రభావం చూపించవచ్చని మరికొందరూ పేర్కొంటున్నారు

మేషరాశి : ఈ రాశి వారు  చేసే వ్యవహారంలో కొత్తగా  మార్పులు జరుగుతాయి. ఓర్పు ..  సహనంతో ఉండండి, ఇష్టదేవతను  ఆరాధన చేయండి ప్రతి బుధవారం ఆవునకు అరటిపండ్లు దానాగా ఇవ్వండి. శనివారం . ..శనికి నువ్వుల నూనె సమర్పించండి.

వృషభరాశి :సాధ్యమైనంత వరకు   ప్రయాణాలు తగ్గించండి..  ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోండి, ధన నష్టం జరిగే అవకాశం ఉంది.  , దుర్గాదేవిని ఆరాధించండి . ఆవునకు తోటకూర ,క్యారెట్ ,బెల్లం ఆహారంగా పెట్టండి. ప్రతి శనివారం వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించండి. 

మిధునరాశి : ఈ రాశి వారికి చికాకు, వైరాగ్యం కలుగుతుంది, ఆందోళనలు, వ్యాపారం విషయంలో అప్రమత్తంగా ఉండండి.  సమయం దొరికినప్పుడు పుణ్యక్షేత్ర యాత్ర చేయండి. ప్రతి మంగళవారం  ఆవునకు నానబెట్టిన కేజింపావు పేసర్లు,బెల్లం పెట్టండి.  ప్రతి సోమవారం పరమేశ్వరుడికి రుద్రభిషేకం చేయండి.  బ్రాహ్మణులకు వస్త్రదానం చేయండి. 

కర్కాటకరాశి :ఈ రాశి వారికి ఆర్థిక లాభం , సుఖం , బంధుకలహం ఉంటుంది.  ప్రతి గురువారం  బియ్యం,బెల్లం ఆవుకు దాణాగా పెట్టండి.  శుబ్రమణ్యేశ్వరుడికి పూజ చేయండి .  ప్రతి షష్టితిథి రోజున నాగేంద్రస్వామికి ఆవు పాలను సమర్పించండి.  పుట్టలో పాలు పోస్తే మరీ మంచిది. 

సింహ రాశి : ఈ రాశి వారికి , శత్రుపీడ, అనారోగ్యం, నిందలు ఉంటాయి.  ప్రతి శనివారం   మినుములు, గోధుమలు, బెల్లం కలిపి గోమాతకు పెట్టండి  దాన ఇవ్వండి.  ఇష్ట దేవతారాధన చేయండి .శనివారం . ..శనికి నువ్వుల నూనె సమర్పించండి.

 కన్యారాశి : ఈ రాశి వారికి  ఆర్థిక ఇబ్బంది, మానసిక, ఆర్థిక, శారీరక ఇబ్బందులు ఏర్పడుతాయి. ప్రతి రోజు  హనుమాన్ చాలీసా చదవండి.  మంగళవారం.. శనివారం .. కోతులకు లేదా గోమాతకు కేజింపావు నానబెట్టిన శనగలకు బెల్లం పట్టించి ఆహారంగా ఇవ్వండి. 

తులారాశి : షష్టగ్రహకూటమి ప్రభావంగా ఈ రాశి వారకి శుభం జరుగుతుంది.  ఆగిన పనులు జరుగుతాయి, కీర్తి , వస్తు , ధనప్రాప్తి , లక్ష్మిదేవిని పూజించండి. ప్రతి సోమవారం క్యారెట్టు ,బెల్లం ఆవునకు పెట్టండి. అలాగే సోమవారంన శివ పరమాత్మకు అభిషేకం చేయండి. శనివారం . ..శనికి నువ్వుల నూనె సమర్పించండి.

 వృశ్చికరాశి : ఈ రాశి వారికి  కలహం , అప్పుల బాధ , కంటి సమస్య , అధిక ఖర్చులు ఉంటాయి.  కాలభైరవ పూజ చేయండి. ఆవునకు నువ్వులు ,బెల్లం పెట్టండి .  ప్రతిసోమవారం శివాలయాన్ని దర్శించండి. 

ధనస్సురాశి :ఈ రాశి వారికి  శ్రమ అధికం , ఆర్థిక, మానసిక ,శారీరక ఇబ్బంది , నవగ్రహ స్తోత్రం , మృత్యుంజయ స్తోత్రం చదవండి. ఆవుకు తోటకూర ,కీరా ,టమోటాలు పెట్టండి.  ప్రతి మంగళవారం.. శనివారం ఆంజనేయస్వామికి 108 ప్రదక్షిణలు చేయండి. 

మకరరాశి : ఈ రాశి వారికి  బంధుకలహం, ఇష్టం లేని వ్యవహార భారం ఉంటుంది.  కాకులకు నువ్వులు,బెల్లం వేసిన చపాతీలు నువ్వుల నూనెతో రొట్టెలు కాల్చి వాటిని సన్న ముక్కలుగా కట్ చేసి కాకులకు వేయండి. హనుమాన్ చాలీసా చదవండి. ప్రతి మంగళవారం ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయండి. ప్రతి సోమవారం ఉపవాస దీక్షపాటించండి. 

కుంభరాశి : శుభం , లాభస్థానం , విశేషయోగం , శివారాధన చేయండి. ఆవుకు నువ్వులు,బెల్లం నానబెట్టిన ఉలవలు ఆహారంగా ఇవ్వండి. శివుడికి అభిషేకం..  ఖాళీ సమయాల్లో దైవదర్శనం..చేయండి.నెలకు ఒక సారి   ఆంజనేయస్వామికి వడమాల లేదా అప్పాల దండ సమర్పించండి. 

మీనరాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు , శ్రమ అధికం , చికాకు , కోపం ,ఆందోళన కలుగుతుంది . దత్తాత్రేయ ఆరాధన చేయండి. ఆవుకు గోధుమలు ,బెల్లం ,తోటకూర ఆహారంగా ఇవ్వండి. ఆంజనేయస్వామికి ఆకుపూజ.. ప్రతి శనివారం ఉపవాస దీక్షపాటించండి.